ర‌జ‌నీకాంత్‌ని 'కుర్చీ'లో కూర్చోబెట్ట‌నున్న మురుగ‌దాస్‌

By iQlikMovies - December 08, 2018 - 15:55 PM IST

మరిన్ని వార్తలు

మురుగ‌దాస్‌... ద‌క్షిణాదిన మోస్ట్ వాంటెడ్ ద‌ర్శ‌కులలో త‌న పేరు త‌ప్ప‌కుండా ఉంటుంది. గ‌జినితో ఓ ప్ర‌భంజ‌నం సృష్టించారు మురుగ‌దాస్. తుపాకీ లాంటి సూప‌ర్ డూప‌ర్ హిట్లు ఆయ‌న ఖాతాలో ఉన్నాయి. లేటెస్టుగా స‌ర్కార్‌ని కూడా హిట్ చేసేశారు. ఇప్పుడు మురుగ‌దాస్ ర‌జ‌నీకాంత్ కోసం ఓ క‌థ సిద్ధం చేశార‌ని, అతి త్వ‌ర‌లో ఈ కాంబినేష‌న్ సెట్స్‌పైకి వెళ్ల‌బోతోంద‌ని కోలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇది కూడా స‌ర్కార్‌లా రాజ‌కీయ నేప‌థ్యంలో సాగే సినిమా అట‌. ఈ చిత్రానికి 'నార్కాలి' అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. 

 

'నార్కాలీ' అంటే కుర్చీ అని అర్థం. రాజ‌కీయాలంటేనే కుర్చీలాట‌. అలా... ర‌జ‌నీకాంత్ స్టామినాకు త‌గిన పేరే ఎంచుకున్నాడు మురుగ‌దాస్. ప్ర‌స్తుతం `పెట్టా`లో న‌టిస్తున్నాడు ర‌జ‌నీ. ఈ సినిమా పూర్త‌యిన వెంట‌నే మురుగ‌దాస్ సినిమా మొద‌ల‌వుతుంద‌ని స‌మాచారం. ర‌జ‌నీ - మురుగ కాంబినేష‌న్ అంటే.. అంచ‌నాలు మామూలుగా ఉండ‌వు. పైగా పొలిటిక‌ల్ డ్రామా కాబ‌ట్టి.. ఈ సినిమా మేకింగ్ ద‌శ‌లోనే సంచ‌ల‌నాలు సృష్టించ‌డం ఖాయ‌మ‌నిపిస్తోంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS