ఆ 'మర్డర్' పై స్పందించిన రజిని..!

By iQlikMovies - July 02, 2020 - 15:30 PM IST

మరిన్ని వార్తలు

తమిళనాడులో... లాక్ డౌన్ సమయం లో ఒక గంటసేపు ఎక్కువ.. షాప్ తెరిచినందుకు.. ఆ సెల్ ఫోన్ షాప్ ఓనర్స్ అయిన తండ్రి, కొడుకులు 'జయరాజ్' మరియు 'బెనిక్స్' లను అరెస్ట్ చేసి.. లాకప్ డెత్ చేసిన సంఘటన దేశం మొత్తాన్ని షాక్ కి గురి చేసింది. పొలిటీషియన్లు, సెలెబ్రిటీలు ఈ సంఘటన పై స్పందించారు. తాజాగా ఈ లిస్ట్ లో ఇప్పుడు సూపర్ స్టార్ 'రజిని' కూడా చేరారు.

 

ఈ ఘటన పై స్పందిస్తూ.. 'దేశమంతా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఖండించినా.. కొంత మంది పోలీసులు మాత్రం.. ఇంకా ఇదే విధంగా జిల్లా మేజిస్ట్రేట్ ముందే ప్రవర్తింస్తున్నారు. ఇలాంటి వాటినుండి ఎవరూ తప్పించుకోవటానికి వీల్లేదు' అన్నారు. తాజాగా తమిళనాడు సర్కారు ఈ దుర్ఘటనకు పాల్పడ్డ 'ఎస్.ఐ' మరియు కానిస్టేబుల్ తో సహా ఐదుగురు పోలీసులను అరెస్ట్ చేశారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS