ప్రస్తుతం సోషల్ మీడియా ఎంతగా మారిపోయిందంటే, ప్రతీ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రస్థావిస్తున్నారు. అయితే సోషల్ మీడియా వేదికగా అనేక రకాల దుష్ప్రచారాలు ఎక్కువయిపోయాయి. అందుకే సోషల్ మీడియా దుష్ప్రచారాలపై రజనీకాంత్ స్పందించారు. రజనీ హీరోగా తెరకెక్కుతోన్న 'రోబో 2.0' సినిమా ఆడియో ఫంక్షన్ దుబాయ్‌లో జరిగింది. ఈ సందర్భంగానే రజనీ సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాలపై తన స్పందన తెలియజేశారు. ఇతరుల సినిమాలపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయొద్దనీ రజనీ అన్నారు. అలాగే సినిమా అనే కాదు, సమాజానికి ఉపయోగపడే అనేక అంశాల్లో సోషల్ మీడియాలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. సమాజానికి మంచి చేయకపోయినా ఫర్వాలేదు. కానీ చెడు చేయడానికి మాత్రం ప్రయత్నించొద్దు అని రజనీకాంత్ అన్నారు. సినిమాల విషయంలో ఎలాంటి టాక్ వచ్చినా, సోషల్ మీడియాలో చెడు ప్రచారం చేయొద్దని రజనీ అన్నారు. అలాగే యువత విషయంలో కూడా రజనీ తన అభిప్రాయాల్ని తెలిపారు. ప్రస్తుతం యువత నేటి సంస్కృతీ సాంప్రదాయాల్ని మెల్లమెల్లగా మర్చిపోతున్నారు. యువత ఎప్పుడూ అలా చేయవద్దు.. వినయంగా, అణకువతో ఉండేవాళ్లే తనకెప్పుడూ ఇష్టమనీ రజనీ అన్నారు. మన సంస్కృతీ సాంప్రదాయాల పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉండాలనీ రజనీ అన్నారు. అలాగే ఈ షోకి హోస్ట్‌గా వ్యవహరించిన రానా, రజనీని తెలుగులో ఓ డైలాగ్ చెప్పమని అడగ్గా, 'నేను ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్లే..' అనే డైలాగ్ చెప్పారు రజినీ. దాంతో వేదిక మొత్తం చప్పట్లు, ఈలలతో మార్మోగిపోయింది. శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. చాలా క్వాలిటీతో తెరకెక్కిన చిత్రమిది. అక్షయ్ కుమార్ ఈ సినిమాలో విలన్‌గా నటించారు. అమీజాక్సన్ హీరోయిన్‌గా నటించింది.