సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు దీపావళి హంగామాకి రెడీ అయిపోయారు. రజనీ ‘అన్నాత్తే’ దీపావళి కానుకగా నవంబరు 4న ప్రేక్షకుల ముందుకురానుంది. తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో విడుదల కానుంది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు వెర్షన్ ట్రైలర్ బయటకి వచ్చింది. రజనీ ఫ్యాన్స్ కోరుకునే అన్నీ ఎలిమెంట్స్ ని ట్రైలర్ లో చూపించారు. రజనీ సినిమా అంటే యాక్షన్, స్టయిల్, కామెడీ.. కామన్. అవన్నీ పెద్దన్నలోకనిపించాయి. దీనితో పాటు పెద్దన్నలో సిస్టర్ సెంటిమెంట్ కూడా వుంది. రజనీ చెల్లి పాత్రలో కీర్తి సురేష్ కనిపించింది.
''న్యాయంగాను ధైర్యం గాను ఓ ఆడపిల్ల వుంటే ఆ దేవుడే దిగొచ్చి తనకి తోడు ఉంటాడు'' అనే డైలాగ్ సిస్టర్ సెంటిమెంట్ ని ఎలివేట్ చేసింది. విలన్ గా జగపతి బాబు మరో సీరియస్ పాత్రలో కనిపించారు. ఆయన లుక్ కూడా రగ్గడ్ గా వుంది. ట్రైలర్ లో ప్రకాష్ రాజ్ పరిచయం ఫన్ పంచింది. ఇక రజనీ కాంత్ చాలా హుషారుగా కనిపించారు. డ్యాన్స్, ఫైట్లు, రజనీ మ్యానరిజ్సం అన్నీ పెద్దన్న ట్రైలర్ లో కనిపించాయి. ఇక చివర్లో 'మిఠాయి కిళ్ళీ ..హ్యాపీలీ' అనే డైలాగ్ తో పెద్దన్న ట్రైలర్ ఫినిషింగ్ టచ్ అదిరిపోయింది