తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం తన కొత్త సినిమా కోసం సంసిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే కార్తిక్ సుబ్బరాజ్ అనే ఓ యంగ్ డైరెక్టర్‌తో సినిమాకి రజనీకాంత్ సైన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఆయన తీసుకోబోతున్న రెమ్యునరేషన్ అక్షరాలా 65 కోట్లు అని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.
అయితే ఇంత భారీ స్థాయిలో ఆయన రెమ్యునరేషన్ ఎందుకు తీసుకుంటున్నారనే విషయంపై కూడా క్లారిటీ ఉంది. రజనీకాంత్ త్వరలోనే సినిమాలకు పూర్తిగా బ్రేకిచ్చి, రాజకీయాలపై దృష్టి పెట్టనున్నారన్న వార్తలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా ఆయన కొత్త సినిమాకి సైన్ చేయడమేంటా? అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆయన రాజకీయ రంగ ప్రవేశానికి లైన్ క్లియర్ చేసుకునేందుకే కొత్త సినిమాకి సైన్ చేశారనీ తెలుస్తోంది.
ఈ సినిమా చేయడం వల్ల వచ్చిన అమౌంట్ మొత్తం ఆయన రాజకీయాల కోసం ఉపయోగించనున్నారట. అంటే జస్ట్ ఫర్ ఫండింగ్ అన్న మాట. రాజకీయాల్లో ఏ పార్టీలోకి రజనీ చేరే యోచనలో లేరట. ఖచ్చితంగా కొత్త పార్టీ స్థాపించే యోచనలోనే ఉన్నారట. అందుకే ఆ పార్టీకి ముందుగానే ఫండ్ సిద్ధం చేయాలనీ, అది కూడా తాను సినిమా చేయడం ద్వారా వచ్చిన డబ్బునే ఉపయోగించాలని రజనీ అనుకుంటున్నారనీ విశ్వసనీయ వర్గాల సమాచారమ్.
ఓ పక్క రజనీ నటించిన రెండు సినిమాలు 'రోబో 2.0', 'కాలా' విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో జూన్ 7న 'కాలా' ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది.