సౌత్ క్వీన్‌గా వెలుగొందుతోన్న ముద్దుడగుమ్మ నయనతార పెళ్లి చేసుకోబోతోందా? అంటే అవునంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. తమిళ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో నయనతార గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీలు చిక్కినప్పుడల్లా తన ప్రియుడు విఘ్నేష్‌తో కలిసి నయనతార వెకేషన్స్‌ని ఎంజాయ్ చేస్తోంది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ఈ జంట తెగ ముచ్చటపడిపోతోంది.
ఇటీవల ఓ అవార్డు ఫంక్షన్‌కి విచ్చేసిన నయనతార ఆ ఫంక్షన్‌లో తన కాబోయే భర్త విషయాన్ని ప్రస్థావనకు తెచ్చింది. అంటే త్వరలోనే నయనతార పెళ్లికి సిద్ధమవుతోందని తెలుస్తోంది. నయనతార ప్రేమ, పెళ్లి ఎప్పుడూ సెన్సేషనే. ఈ సారి సెన్సేషన్‌లో ఉన్న నయన్ ప్రేమ ఎప్పుడెప్పుడు పెళ్లి పీటలదాకా చేరుతుందా? అని ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారు.
ఇటీవలే 'జై సింహా', 'కర్తవ్యం' సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన నయనతార చేతిలో భారీ బిగ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. తమిళంలో కాక, తెలుగులోనే ఆమె చేతిలో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులున్నాయి. వాటిలో ఒకటి మెగాస్టార్‌తో నటిస్తున్న 'సైరా నరసింహారెడ్డి' చిత్రం. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. రామ్‌చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
కాగా ఓ పక్క సినిమాలతో ఇంత బిజీ షెడ్యూల్‌తో ఉన్నప్పటికీ, మరో పక్క తన లవ్ మూమెంట్స్‌ని కూడా ఏమాత్రం మిస్ కాకుండా, ఎంజాయ్ చేస్తున్న నయనతారకు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే మరి.