'2.0' - 500 కోట్లు.. గట్టెక్కినట్టేనా.?

మరిన్ని వార్తలు

మొన్నేమో 400 కోట్లు కొల్లగొట్టేసిందనే ప్రకటన.. తాజాగా 500 కోట్లు వసూలు చేసిందనే ప్రకటన.. రేపో మాపో 600 కోట్లు, ఆ పైన వసూలు చేసిందంటూ రాబోయే ప్రకటన.. వెరసి, '2.0' పబ్లిసిటీ అదరగొట్టేస్తున్నారు. పబ్లిసిటీ స్టంట్స్‌ సంగతి పక్కన పెడితే, '2.0' సినిమా గట్టెక్కుతుందా.? లేదా.? అనేదానిపై కొంత గందరగోళం ఇంకా అలాగే వుంది. ఎందుకంటే ఈ సినిమా కోసం 600 కోట్లు ఖర్చు చేసినట్లు స్వయంగా హీరో రజనీకాంత్‌ ప్రకటించాడు.

600 కోట్లు ఖర్చు చేస్తే, ఎంత మొత్తంలో సొమ్ములు తిరిగి రావాలట.? ఖర్చు విషయంలో రజనీకాంత్‌ కొంత 'అతి' ప్రదర్శించి వుండొచ్చు. అలాగే వస్తున్న వసూళ్ళ విషయంలోనూ ఆ 'అతి' వుంటుంది. దుబాయ్‌లో సినిమా ప్రమోషన్‌ కనీ వినీ ఎరుగని రీతిలో చేయడం.. అలాగే, సినిమా కోసం గ్రాఫిక్స్‌ ఓ రేంజ్‌లో వాడేయడం, వీటన్నిటికీ మించి సినిమా నిర్మాణం కోసం ఎక్కువ సమయం తీసుకోవడం వంటివన్నీ పరిగణనలోకి తీసుకుంటే '2.0' గట్టెక్కడం అంత తేలిక కాదు.

తెలుగులో ఇప్పటికే ఈ సినిమా 40 కోట్ల మార్క్‌ దాటినప్పటికీ, ఆశించిన స్థాయిలో లాభాలు వస్తాయా? అనేదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చైనాలో 50 వేల థియేటర్లలో విడుదల.. అంటూ ఓ ప్రకటన రావడం, సినిమా గురించి ఎప్పటికప్పుడు ప్రచారం కొత్త పుంతలు తొక్కిస్తుండడం ఇవేవీ సినిమాని గట్టెక్కించేలా మాత్రం కన్పించడంలేదన్నది నిర్వివాదాంశం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS