తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'రోబో 2.0' ఎప్పుడో రావాల్సి ఉంది. కానీ వాయిదాల పర్వంతో అంతకంతకూ వెనక్కి వెళ్లిపోతోంది. విజువల్ ఎఫెక్ట్స్ పేరుతో ఎప్పుడో చిత్రీకరణ పూర్తయిన 'రోబో 2.0' విడుదలకు నోచుకోవడం లేదు. ఇదిగో వస్తది, అదిగో వస్తది అంటున్నారు కానీ, ఇంతవరకూ విడుదల కాలేదు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పరిస్థితి ఇలా ఉంటే, అల్లుడు ధనుష్ నిర్మాణంలో రూపొందిన 'కాలా' పరిస్థితి కూడా అలాగే ఉంది. 'కబాలి' తెరకెక్కించిన పా రంజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
కాగా సినిమాల పరిస్థితి ఇలా ఉంటే, మరో పక్క రజనీకి రాజకీయాల టెన్షన్. రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చినట్లో, రానట్లో తెలీని సందిగ్ధంలో అభిమానులున్నాయి. ఇవన్నీ ఒకెత్తైతే సూపర్‌స్టార్ కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఫ్యాన్స్‌కి షాక్‌తో పాటు, కొత్త ఉత్సాహాన్ని కూడా ఇచ్చారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శత్వంలో సన్‌పిక్చర్స్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు.
సినిమాలు, రాజకీయాల పరిస్థితి ఇలా ఉంటే, హెల్త్ చెకప్కని ప్రస్తుతం అమెరికా వెళ్లారు రజనీకాంత్. కొంతకాలం క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైన రజనీకాంత్ ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. అప్పటి ఆ అనారోగ్యం వివరాలు ఏంటో బయటికి రాలేదు. కానీ అప్పుడప్పుడు విదేశాల్లో హెల్త్ చెకప్‌కి వెళ్లి వస్తున్నట్లు సమాచారమ్.