రాజుగాడు చిత్రంతో ఆకట్టుకున్న దర్శకురాలు సంజనారెడ్డి. ప్రస్తుతం ఆమె అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రి పాలయ్యారు. ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స అందుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. దాంతో సంజనకు ఏమైందన్న అనుమానాలు, ఆందోళనలు కలుగుతున్నాయి. ఆమె ఇటీవల బరువు తగ్గడానికి ఆహార నియమాలు పాటిస్తూ, డైటింగ్ చేస్తున్నార్ట. అది వికటించిందని భోగట్టా. పైగా ఇటీవల ఆమెకు జ్వరం వచ్చిందని, అప్పుడు కూడా ఆహారం తీసుకోకుండా డైటింగ్ పాటించారని, దాని వల్ల ఆమె అనారోగ్యం పాలైందని సమాచారం.
బ్రెయిన్‌లో ఇన్‌ఫెక్షన్ అయ్యిందని, ఆమె అరోగ్యం ఆందోళన కరంగానే ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం `కరణం మల్లీశ్వరి` బయోపిక్ పనుల్లో బిజీగా ఉన్నారామె. ఈ సినిమాకి సంబంధించిన ప్రకటన ఇటీవలే వెలువడింది. నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని ఎంపిక చేసే కార్యక్రమం మొదలైంది. ఇంతలోనే ఆమె ఆరోగ్యం పాడవవ్వడం, ఆసుపత్రి పాలవ్వడం చిత్రసీమని కలిచివేస్తోంది.