రాజు గారి గది-2 కి ముహూర్తం ఫిక్స్

మరిన్ని వార్తలు

నాగార్జున వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్న రాజు గారి గది 2 చిత్రానికి సంబందించిన ట్రైలర్ విడుదలకి ముహూర్తం కుదిరింది.

సెప్టెంబర్ 20 అనగా ఏఎన్నార్‌ పుట్టినరోజు సందర్భంగా రాజు గారి గది 2 ట్రైలర్ నివిడుదల చేయనున్నారు. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ చిత్రంలో నాగార్జునతో పాటుగా సమంతా, సీరత్ కపూర్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

రాజు గారి గది చిత్రానికి దర్శకత్వం వహించిన ఓంకార్ ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు, ఇప్పటికే ఈ చిత్రానికి సంబందించిన లుక్స్, టీజర్ ఈ చిత్రం పైన అంచనాలని పెంచేశాయి.

ఇక ఈ చిత్రం వచ్చే నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS