ఓంకార్‌ గదిలోకి మరో హీరోయిన్‌!

మరిన్ని వార్తలు

యాంకర్‌ నుండి డైరెక్టర్‌గా ఎదిగిన ఓంకార్‌ ప్రస్తుతం 'రాజుగారి గది' మూడో పార్ట్‌ని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఈ సినిమా లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. తమన్నా ప్రధాన పాత్రలో ఈ సినిమా స్టార్ట్‌ అయ్యింది. అయితే, అనూహ్యంగా ఈ సినిమా నుండి తమన్నా ఔట్‌ అనే వార్త ఈ మధ్య ప్రచారం జరిగింది. కానీ, ఓంకార్‌ ఈ విషయాన్ని ఇంతవరకూ ఖండించలేదు.

 

అలాగని సమర్ధించలేదు. తమన్నా అయితే, ఈ ప్రాజెక్ట్‌ నుండి దాదాపు తప్పుకున్నట్లే అనే న్యూస్‌ కన్‌ఫామ్‌ అనే తెలుస్తోంది. అయితే, తమన్నా తప్పుకుంటే, మరి ఓంకార్‌ గదికి హీరోయిన్‌ ఎవరిప్పుడు.? అదే ప్రశ్నార్ధకంగా మారింది. నిజానికి ఈ సబ్జెక్ట్‌ మొదట సమంత దగ్గరకు వెళ్లింది. స్క్రిప్టు నచ్చకపోవడంతో సమంత నో చెప్పేసింది. తర్వాత స్క్రిప్టులో కొన్ని మార్పులు చేర్పులు చేసిన పిదప తమన్నాని సంప్రదించగా తమన్నా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో సినిమాని పట్టాలెక్కించేశాడు ఓంకార్‌. కానీ, సెట్స్‌ మీదికెళ్లాక తనకు చెప్పిన స్క్రిప్టుకీ, సెట్‌లో నెరేట్‌ చేస్తున్న స్క్రిప్టుకీ సంబంధం లేకపోవడంతో తమన్నా ఈ ప్రాజెక్ట్‌ నుండి తప్పుకుందనే సమాచారమ్‌.

 

సమంత నో చెప్పడం, మిల్కీ బ్యూటీ హ్యాండివ్వడంతో పాపం ఓంకార్‌ గదికి హీరోయిన్‌ కొరత ఏర్పడింది. మరి ఓంకార్‌ ఏం చేస్తాడు.? తన గదిలో హీరోయిన్‌గా కొత్త భామను ఏమైనా దించుతాడా.? లేక మరే స్టార్‌ హీరోయిన్‌నైనా బతిమలాడుకుంటాడా? అసలింతకీ మిల్కీ బ్యూటీ నో చెప్పడం నిజమేనా.? అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే ఓంకార్‌ తక్షణమే స్పందించాల్సి ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS