రాజుగారి గది పేరుతో వరుస సినిమాలు తీస్తున్నాడు ఓంకార్. రాజుగారి గది మంచి హిట్టయ్యింది. ఆర్థికంగానూ లాభాల్ని తెచ్చిపెట్టింది. ఆ జోష్తో రాజుగారి గది 2 తీశాడు. నాగార్జున, సమంత లాంటి స్టార్ బలం ఈ సినిమాకి ప్లస్ అయ్యింది. ఇప్పుడు రాజుగారి గది 3 వచ్చింది. విమర్శకులు ఈ సినిమాని ఏకి పడేశారు. రివ్యూలు చాలా దారుణంగా వచ్చాయి. కాకపోతే బీ, సీ సెంటర్లలో ఈ సినిమాకి కాస్తో కూస్తో ఓపెనింగ్స్ లభించాయి. విడుదలకు ముందు బిజినెస్ కూడా బాగానే జరగడంతో ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యింది.
ఆర్థికంగా ఈ సినిమా గట్టెక్కేసినట్టే. దాంతో రాజుగారి గది 4కి తలుపులు తెరచుకున్నాయి. పార్ట్ 3ని తన తమ్ముడి కోసం తీసిన ఓంకార్.. పార్ట్ 4 మాత్రం ఓపెద్ద హీరోతో చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఆ హీరో వెంకటేష్ అని తెలుస్తోంది. రాజుగారి గది 2 వెంకటేష్ తోనే తీయాల్సింది. కానీ... తన డేట్లు కుదరకపోవడం వల్ల నాగార్జునతో తీశారు. రాజుగారి గది 4లో వెంకటేష్ నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సమాచారం. వెంకీ ప్రస్తుతం `వెంకీమామా`తో బిజీగా ఉన్నారు. వాటితో పాటు రెండు మూడు స్క్రిప్టులు కూడా సిద్ధంగా ఉన్నాయి. మరి రాజుగారి గదికి ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో చూడాలి.