రాఖీసావంత్‌ బోల్డ్‌ డెసిషన్‌.!

By iQlikMovies - September 26, 2018 - 15:48 PM IST

మరిన్ని వార్తలు

ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లోకెక్కి హాట్‌ టాపిక్‌ అయ్యే బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ రాఖీ సావంత్‌ తాజాగా ఓ బోల్డ్‌ డెసిషన్‌ తీసుకుంది. ఆర్గాన్స్‌ డొనేట్‌ చేయడమనేది అందరికీ తెలిసిందే. తమ తమ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని కొంతమంది చనిపోయాక తమ ఆర్గాన్స్‌ని డొనేట్‌ చేయాలని అనుకుంటారు. 

అయితే ఆర్గాన్స్‌ అంటే.? కళ్లు, గుండె, కిడ్నీలు.. ఇలా కొన్ని రకాల ఇంపార్టెంట్‌ ఆర్గాన్స్‌ అన్నమాట. అయితే ఈ హాట్‌ బ్యూటీ ఇవ్వాలనుకున్న ఆర్గాన్స్‌ ఏంటో తెలుసా? తన బ్రెస్ట్‌ని. అవాక్కయ్యారా? అవ్వరు మరీ. సోషల్‌ మీడియాలో ఇప్పుడంతా ఇదే చర్చతో హీటెక్కిపోతోంది. బ్రెస్ట్‌ని దానం చేయాలనుకోవడం.. అదసలు సాధ్యమేనా? ఒకవేళ దానం చేస్తే అవి పనికొస్తాయా? ఇలాంటి పిచ్చి పిచ్చి డౌట్స్‌తో నెటిజన్లు జుట్టు పీక్కుంటున్నారు. 

గతంలో హీరోయిన్‌ రంభ తన తొడలు దానం చేస్తానని చెప్పింది. అది కూడా సిల్లీ స్టేట్‌మెంటే. అలాగే ఇప్పుడు రాఖీ సావంత్‌ చేసిన ఈ బోల్డ్‌ స్టేట్‌మెంట్‌కి ఎలా రెస్పాండ్‌ కావాలో తెలీడం లేదు. మరీ వార్తల్లో నిలవడానికి ఇలాంటి స్టేట్‌మెంట్స్‌ చేయాలా? ఈ సిల్లీ డెసిషన్‌ని ఓ వీడియోలో బంధించి, ఆ వీడియోని సోషల్‌ మీడియాలో వదిలేసి, నెటిజన్స్‌ని విస్తుపోయేలా చేసిందీ హాట్‌ బ్యూటీ రాఖీసావంత్‌. 

బాలీవుడ్‌లో హాట్‌ ఐటెం బాంబ్‌గా పేరొందిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం చేతిలో సినిమాల్లేక ఖాళీగానే ఉంది. ఈ తరుణంలో ఇలాంటి ప్లాన్‌ చేసి, సింపుల్‌గా వైరల్‌ అయిపోయింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS