'మన్మధుడు 2' ట్రైలర్‌లో గుప్పు గుప్పుమంటూ పొగలు వదులుతూ, స్మోకింగ్ చేసిందని రకుల్‌ని తెగ ఆడి పోసుకున్నారు. ఇంకా ఆడిపోసుకుంటూనే ఉన్నారు. తాజాగా ఛార్మి వైన్ గ్లాస్‌తో దర్శనమిచ్చింది. హీరోయిన్‌గా ఒకప్పుడు హద్దుల్లేని ఎక్స్‌పోజింగ్‌తో రెచ్చిపోయిన ఛార్మి ఇప్పుడు నటనకు గుడ్ బై చెప్పేసి, నిర్మాతగా సెటిలైపోయింది. పూరీ జగన్నాధ్‌తో కలిసి పూరీ కనెక్ట్స్ బ్యానర్‌లో సంయుక్తంగా సినిమాలు నిర్మిస్తోంది.
తాజాగా 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ఆ ఆనందంతోనే ఇదిగో ఇలా మందు పార్టీ చేసుకుంటోంది. చేతిలో వైన్ గ్లాస్‌తో ఉన్న పిక్ ఒకటి తాజాగా ఛార్మి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకి భిన్న స్పందనలు వస్తున్నాయి నెటిజన్స్ నుండి. ముద్దుగుమ్మలు మరీ బరి తెగించేశారు.. అంటూ భారీ డైలాగులతో నెటిజన్స్ స్పందిస్తున్నారు. ఈ ఎఫెక్ట్ కూడా రకుల్‌కే తగిలింది.
ఇంతవరకూ స్మోకింగ్ విషయమై రకుల్‌ని ఆడేసుకుంటున్న నెటిజన్లు, ఛార్మి పేరు చెప్పి మరోసారి రకుల్ పేరునే ప్రస్థావిస్తున్నారు. అది నిజం కాదు, కేవలం సినిమా కోసమే చేశానని రకుల్ మొత్తుకుంటున్నా, నెటిజన్స్ వదిలిపెట్టడం లేదు. అయితే, స్మోకింగ్, డ్రింకింగ్ అనేవి గ్లామర్ ప్రపంచంలో మేల్, ఫిమేల్ ఇద్దరికీ ఈక్వెలే. కానీ, పబ్లిగ్గా ఇలా ప్రమోట్ చేసుకోవడమే బాగా లేదనేది నెటిజన్స్ అభిప్రాయం.