'రౌడీ' బాటలోనే రకుల్‌ కూడా!

మరిన్ని వార్తలు

'డియర్‌ కామ్రేడ్‌'పై విడుదలకు ముందున్న బజ్‌ని బట్టి, బాలీవుడ్‌లో రీమేక్‌ చేసేందుకు ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ ముందుకొచ్చారనే టాక్‌ వినిపించింది. ఆ రీమేక్‌ కోసం విజయ్‌ దేవరకొండను సంప్రదించగా, విజయ్‌, కరణ్‌కి నో చెప్పాడంటూ ప్రచారం జరిగింది. అవును నిజమే, ఒకే పాత్రలో రెండు సార్లు నటించాలంటే తనకు బోరింగ్‌ అనీ, అందుకే నో చెప్పాననీ విజయ్‌ కూడా ఒప్పుకున్నాడు.

 

అయితే, తాజాగా ఇదే మాట రకుల్‌ నోట వినిపిస్తోంది. రకుల్‌ కూడా తన సినిమా రీమేక్‌లో తానే ఇంకోసారి నటించాలంటే అస్సలు కిక్‌ ఉండదనీ, బోర్‌ కొడుతుందనీ చెబుతోంది. ఇంతకీ రకుల్‌ ఏ సినిమా గురించి మాట్లాడుతుందంటే, ఇంకేం సినిమా.. ఆమె తెలుగులో ఫుల్‌ లెంగ్త్‌ హీరోయిన్‌గా నటిస్తున్న 'మన్మధుడు 2' కోసమే. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో రకుల్‌ చాలా ఆసక్తికరమైన విషయాల్ని ముచ్చటించింది. ఈ మధ్య 'మన్మధుడు 2' బాలీవుడ్‌లో రీమేక్‌ కానుందట అనే గాసిప్‌ కూడా ఏదో అలా అలా చక్కర్లు కొట్టిందిలెండి. ఒకవేళ అదే నిజమై, అక్కడ కూడా తానే నటించాలని కోరితే నో చెప్పేస్తానని రకుల్‌ బేబీ చెప్పింది.

 

కొంచెం ఓవర్‌గా అనిపించట్లే. సినిమా విడుదలయ్యాక, రిజల్ట్‌ చూసినాక ఏం మాట్లాడినా చెల్లుతుంది కానీ, ఇదిగో ఇలా ఓవరాక్షన్‌ చేస్తేనే ''కామ్రేడ్‌'ని ఎలా కామ్‌ అప్‌ చేసేశామో చూశావ్‌గా..' అంటూ సోషల్‌ మీడియాలో నెటిజన్లు రకుల్‌ని ఆటాడేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో రకుల్‌ హాట్‌నెస్‌ పట్ల సర్వత్రా కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. దాంతో పాటు, ఇలాంటి ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ కూడా ప్రదర్శిస్తే, ఆడియన్స్‌ ఊరుకుంటారేమో కానీ, వామ్మో.! నెటిజన్స్‌ అస్సలు ఊరుకోరండీ బాబూ!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS