ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం- భేటీ బచావో భేటి పడావో. ఈ పథకాన్ని దేశంలోని ప్రతి రాష్ట్రంలో అమలు అయ్యేలా చూడమని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకి సైతం ఆయన వ్యక్తిగతంగా చెప్పడం విశేషం.
ఇక ఆ పథకాన్నితెలంగాణ రాష్ట్రంలో అమలు చేసే క్రమంలో ఆ పథకాన్ని కింది స్థాయి వరకు చేర్చే ఆలోచనతో ప్రముఖ నటి రకుల్ ప్రీత్ ని ఈ పథకానికి మన రాష్ట్రంలో బ్రాండ్ అంబాసిడర్ గా ప్రభుత్వం నియమించింది.
దీనికి సంబందించిన ప్రకటన కూడా వెలువడింది. ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ తన సమ్మతిని వ్యక్తం చేస్తూ- ఈ పథకం అవసరమైన వాళ్ళకి చేర్చే విధంగా తనవంతు సహాయం చేస్తాను అని తెలిపింది.
ఇక పలువురు సెలబ్రిటీలు రకుల్ ప్రీత్ కి శుభాకాంక్షలు తెలియచేశారు.