'రాజుగారి గది'లో సీరత్‌ బికినీ అందాలు

మరిన్ని వార్తలు

నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న సినిమా 'రాజుగారి గది - 2'. సీరత్‌ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఓంకార్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కాగా ముద్దుగుమ్మ సీరత్‌ కపూర్‌ ఈ సినిమాలో హాట్‌ హాట్‌ అందాలతో రెచ్చిపోయిందని ట్రైలర్‌ చూస్తేనే తెలుస్తోంది. తాజాగా సీరత్‌ బికినీ అందాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన స్టిల్సే అవి. అంటే సీరత్‌ 'రాజుగారి గది' కోసం బికినీ దర్శనం గావించిందన్న మాట. బికినీలో అమ్మడి అందాలకు ఫిదా అయిపోతున్నారు ఆడియన్స్‌. రేపే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగార్జునతో నటించే అవకాశం ఈ సినమా ద్వారా దక్కినందుకు అమ్మడి ఆనందానికి అవధుల్లేవు. సినిమాలున్నా, లేకపోయినా ఈ బ్యూటీ సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది. హాట్‌ హాట్‌ పిక్స్‌తో కుర్రకారుని హీటెక్కిస్తూ ఉంటుంది. అయితే నాగార్జునలాంటి స్టార్‌ హీరోతో జత కట్టే అవకాశం వచ్చాక అమ్మడిలో హాట్‌నెస్‌ మరీ రెట్టింపయ్యింది. స్టార్‌ హీరో అయినప్పటికీ నాగార్జునతో కలిసి నటించడం చాలా కంఫర్ట్‌గా ఉందంటోందీ బ్యూటీ. చాలా ఎంకరేజ్‌ చేశారనీ అంటోంది. అంతేకాదు, అమ్మడు ఈ సినిమా కోసం గొంతు సవరించుకుందట. చిన్న బిట్‌ సాంగ్‌ కూడా పాడేసిందట ఈ సినిమాలో అమ్మడు. ఈ సినిమాలో ముద్దుగుమ్మ సమంత కీలక పాత్రలో నటిస్తోంది. నాగార్జున మనసుల్ని చదవగలిగే మెంటలిస్ట్‌ పాత్రలో నటిస్తున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS