మరోసారి హీటెక్కించిన రకుల్‌

మరిన్ని వార్తలు

మొన్నామధ్య మేగ్జిమ్‌ పత్రిక కోసం విచ్చలవిడి గ్లామర్‌తో ఫోటోలకు పోజిచ్చేసి వివాదాస్పదమైన రకుల్‌ ప్రీత్‌సింగ్‌ మరోసారి హాట్‌నెస్‌తో రెచ్చిపోయింది. ఈసారి 'ఫిల్మ్‌ఫేర్‌' కవర్‌ పీజీ కోసం తన హాట్‌ హాట్‌ అందాలను మరోసారి ఆరబోసేసింది. కవర్‌పేజీపై హాట్‌ గ్లామర్‌తో పాటు, కాస్టింగ్‌ కౌచ్‌ తదితర అంశాలపై కూడా రకుల్‌ తన స్పందన తెలియచేసినట్లుగా కనిపిస్తోంది. 

ఈ మధ్య టాలీవుడ్‌లో వివాదాస్పదమైన కాస్టింగ్‌ కౌచ్‌ వ్యవహారంలో రకుల్‌ కూడా టార్గెట్‌ అయ్యింది. అయితే సినీ రంగంలో కాస్టింగ్‌ కౌచ్‌ తనకు ఎప్పుడూ ఎదురు కాలేదని రకుల్‌ చెప్పిన మాటే విమర్శకులు ఆమెను టార్గెట్‌ చేసేలా చేసింది. ఏది ఏమైనా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ బాలీవుడ్‌కెళ్లాక చాలా మారిపోయింది. అంతవరకూ స్క్రీన్‌పైనే అందాలారబోసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఇదిగో ఇలా మేగ్జైన్‌ కవర్‌ పేజీల పేరు చెప్పి, విచ్చల విడి ఎక్స్‌పోజింగ్‌కి తెర లేపింది. 

ప్రస్తుతం తెలుగులో ఆఫర్లు రాకపోయినా, తమిళంలో రెండు సినిమాలతో రకుల్‌ ప్రీత్‌సింగ్‌ బిజీగా ఉంది. హిందీలో అజయ్‌దేవగణ్‌ హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో రకుల్‌ నటిస్తోంది. మొన్నటిదాకా చిన్న హీరో, పెద్ద హీరో అనే తేడా లేకుండా, టాలీవుడ్‌లో మొత్తం దున్నేసిన రకుల్‌ సడెన్‌గా మాయమైపోయింది. ఇప్పుడు తెలుగులో ఆఫర్స్‌ కోసం ఈగర్‌గా ఎదురు చూస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS