అర్జున్ రెడ్డి చిత్రంలో ప్రీతి పాత్రతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయిన షాలిని పాండే కి మొదటి చిత్రం నుండే చాలా మంది అభిమానులు అయిపోయారు. ఇక ఈ మధ్యనే మహానటి చిత్రంలో, సావిత్రి స్నేహితురాలిన సుశీల పాత్రలో మెరిసింది.
ఇక ఆమె తొలిచిత్రం జ్ఞాపకాలని గుర్తుచేసుకుంటూ- తన మొదటి చిత్రంలో నటించే సమయంలో నరకం అనుభవించాను అని చెప్పి ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. అయితే ఆమె ఈ మాట అనడానికి కారణం ఏంటంటే- ముద్దు సన్నివేశాలలో నటించడం తనకి ఇష్టం లేనప్పటికి, కథకి అది అవసరం కాబట్టి తాను ఇష్టం లేకపోయినా నటించేసాను అని చెప్పుకొచ్చింది.
అలా తనకి ఇష్టంలేని సన్నివేశాల్లో నటించడం చాలా ఇబ్బందిగా అనిపించినప్పటికి, అది తన ముఖంలో ఏమాత్రం తెలియనివ్వకుండా చాలా చక్కగా అభినయించింది అనే చెప్పాలి. ఏదేమైనా... సినిమా విడుదలైన ఇన్నిరోజులకి, పైగా సినిమా ఇంతలా ప్రజాదరణ పొందిన తరువాత షాలిని ఇలా చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రస్తుతం షాలిని పాండే చేతిలో ఒక తెలుగు చిత్రం, రెండు తమిళ చిత్రాలు ఉన్నాయి.