బోయపాటి - చరణ్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఫ్రెష్ అప్‌డేట్ ఒకటి హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాలో రకుల్ గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతోందంటూ టాక్ వినిపిస్తోంది.
గతంలో రకుల్ ప్రీత్‌సింగ్ - చరణ్ కాంబినేషన్‌లో రెండు సినిమాలు వచ్చాయి. రెండింట్లో 'బ్రూస్‌లీ' నిరాశపరిచినా, 'ధృవ' సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అయినా ఈ పెయిర్‌కి సూపర్ పెయిర్ అని పేరొచ్చింది. రకుల్ - చరణ్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ సూపర్బ్ కూడా. అందుకే బోయపాటి సినిమా కోసం రకుల్ వస్తోందంటూ సమాచారమ్.
ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ తమిళ, హిందీ సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో రకుల్ హవా ప్రస్తుతం అస్సలు లేదు. బోయపాటి సినిమాల్లో గ్లామర్ కాస్త ఎక్కువన్న సంగతి తెలిసిందే. హీరోయిన్స్ విషయంలో వీలైతే ఒకరు అంతకన్నా ఎక్కువ మందినే వాడేస్తుంటాడు బోయపాటి. అలాగే ఐటెం గాళ్స్ కూడా ఒకరే ఉండాలనేం రూల్ లేదు. ఎంతమందినైనా అడ్జస్ట్ చేయగల సత్తా ఉన్న డైరెక్టర్. ఆల్రెడీ ఈ సినిమాలో 'భరత్' బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పుడు రకుల్ పేరు వినిపిస్తోంది.
గెస్ట్ రోల్‌గానేనా? లేక స్పెషల్ సాంగ్ కోసమేమైనా రకుల్‌ని తీసుకుంటున్నాడా? అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ టాక్ నిజమైతే, చరణ్ సినిమాతో రకుల్ తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వబోతోందనే విషయాన్ని ప్రస్తుతానికి కన్‌ఫామ్ చేసుకోవచ్చు. అధికారిక ప్రకటన వచ్చాక, ఫైనల్‌గా కన్‌ఫామ్ చేస్కోవచ్చన్న మాట. అదీ సంగతి.