స్టార్ హీరోయిన్లలో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ జోరు ఈమధ్య టాలీవుడ్ లో కొంచెం తగ్గింది కానీ ఇప్పటికీ చేతిలో చెప్పుకోదగ్గ ఆఫర్లే ఉన్నాయి. ఈమధ్య షూటింగులు లేకపోవడంతో విపరీతంగా ఎక్సర్ సైజులు చేస్తూ ఫిట్నెస్ పై ఫోకస్ చేసిన ఈ భామ కొత్త అవకాశాలకోసం ఫీజు కూడా సగం డిస్కౌంట్ ఇచ్చిందని టాక్ ఉంది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యమా యాక్టివ్. రీసెంట్ గా అభిమానులతో లైవ్ చాట్ లో ముచ్చటించింది.
ఓ అభిమాని రకుల్ ను "మీరు వివాహం చేసుకోబోయే వ్యక్తి ఎలా ఉండాలి?' అని ప్రశ్నిస్తే అప్పట్లో నాకు కాబోయే వ్యక్తికి ఎలా ఉండాలో, ఏ క్వాలిటీస్ ఉండాలో పెద్ద లిస్టు ఉండేది. అయితే ఇప్పుడు నేను చేసుకోబోయే వ్యక్తికి అన్ని లక్షణాలు ఉండాల్సిన అవసరం లేదని చెప్పింది. జస్ట్ అబ్బాయి అయితే చాలు అని ఓ జోక్ కూడా వేసింది. తనకు పెద్ద అందగాడు అవసరం లేదని, తన పని మీద ఇష్టం, గౌరవం ఉన్నవాడు కావాలని చెప్పింది. జీవితాన్ని సాఫీగా ముందు నడిపేవాడు అయితే బాగుంటుందట. అయితే తనను చేసుకోబోయేవాడు తెలివైనవాడు, బుద్ధిమంతుడు అయి ఉండడం ముఖ్యమని గుర్తు చేసింది. లేవు లేవంటూనే చాలానే లిస్టు చెప్పింది ఈ చలాకీ భామ!
ఇదలా ఉంటే కొద్ది రోజుల క్రితం రకుల్ అమ్మగారు మీడియాతో మాట్లాడుతూ మా అమ్మాయి సినిమాలతో బిజీగా ఉందని, సినిమాలు ఎంతకాలం చేస్తే అంతకాలం చేయనిస్తామని చెప్పింది. రకుల్ పెళ్లికి తొందరేమీ లేదని, ఎప్పుడు చేసుకుంటానని చెప్తే అప్పుడే పెళ్లి చేస్తామని, తనకు నచ్చిన అబ్బాయితోనే పెళ్లి చేస్తామని స్పష్టం చేసింది. ఇలాంటి అమ్మగారు అందరికీ ఉంటే సగం సమస్యలు తగ్గిపోతాయి కదా!