గ్లామరస్‌ విన్నర్‌ - తట్టుకోగలరా?

మరిన్ని వార్తలు

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ని ఇప్పటిదాకా చాలా సినిమాల్లో గ్లామరస్‌గా చూసేశాం. అయితే వాటన్నిటికీ మించి 'విన్నర్‌' సినిమాలో రకుల్‌ సూపర్‌ గ్లామరస్‌గా కన్పించబోతోందట. సినిమా స్టిల్స్‌ని బట్టి చూస్తే, రకుల్‌ అల్ట్రా మోడ్రన్‌ లుక్‌తో కట్టి పడేయడం ఖాయమనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో పెర్ఫామెన్స్‌తోపాటు, గ్లామర్‌ విషయంలోనూ రకుల్‌ ఎంతో జాగ్రత్త పడుతోంది. మొదటి సినిమా నుంచి ఇప్పటిదాకా రకుల్‌ గ్లామర్‌ ప్రదర్శించని సినిమానే లేదు. 'పరేషానురా' అంటూ 'ధృవ' సినిమాలో ఆమె చూపిన గ్లామర్‌ ఇప్పటిదాకా ఆమె చేసిన సినిమాల్లోకే హైలైట్‌ అని చెప్పక తప్పదు. దాన్ని మించేలా 'విన్నర్‌'లో సాయిధరమ్‌తో గ్లామరస్‌గా ఆన్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీని రకుల్‌ పండించేసిందని సమాచారమ్‌. 'విన్నర్‌' ఆడియో సింగిల్స్‌ పరంగా సాయిధరమ్‌ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాడు. మహేష్‌బాబు, సమంత, అనిరుధ్‌ ఇప్పటిదాకా మూడు ఆడియో సింగిల్స్‌ని తమ సోషల్‌ మీడియా అకౌంట్స్‌ ద్వారా విడుదల చేయగా, నేడు రవితేజ మరో ఆడియో సింగిల్‌ని విడుదల చేస్తాడు. అలా అందరు హీరోల అభిమానులకీ దగ్గరయిపోయాడు మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ. రకుల్‌ కూడా అంతే. టాలీవుడ్‌లో అందరితోనూ చాలా క్లోజ్‌గా మూవ్‌ అవుతుంది. మహేష్‌తో ఓ సినిమాలో నటిస్తున్న రకుల్‌, ఎన్టీఆర్‌తో సినిమా చేసింది, రవితేజతో కూడా ఓ సినిమా చేసేసింది. అందరు హీరోలతోనూ ఆమె కెమిస్ట్రీ బాగుండటమే కాకుండా, రియల్‌ లైఫ్‌లో కూడా మంచి మంచి స్నేహాలు చేయడం రకుల్‌ ప్రత్యేకత.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS