నాలుగు చేతులా సంపాదించడం ఎలాగో మన కథానాయికల్ని చూసి నేర్చుకోవాలి. ఓ వైపు సినిమాలు, మరోవైపు ప్రకటనలు అంటూ బ్యాంకు బాలెన్సులు స్పీడుగా పెంచుకుంటున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ లాంటివాళ్లైతే వ్యాపార రంగంలోనూ దిగుతున్నారు. రకుల్ ఫిట్ నెస్ సెంటర్లని ప్రారంభించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాల్లో జిమ్‌లు నిర్వహిస్తోంది. సెలబ్రెటీ వ్యాపారం అంటే జోరుగానే ఉంటుంది.
అందుకే ప్రారంభంలో.. రకుల్ జిమ్ సెంటర్లు కళకళలాడాయి. అయితే లాక్ డౌన్‌లో రకుల్ వ్యాపారం బాగా దెబ్బతింది. ఆ సీజన్లో తీవ్ర నష్టాలొచ్చాయట. ఈ విషయాన్ని తానే చెప్పింది. లాక్ డౌన్ సమయంలో అన్ని వ్యాపారాలూ బాగా దెబ్బతిన్నాయని, ముఖ్యంగా ఫిట్ నెస్ సెంటర్లపై ఎక్కువ ప్రభావం చూపించిందని, అయినా సరే, తాను లాక్ డౌన్ సమయంలోనూ సిబ్బందికి జీతాలు చెల్లించానని, ఇప్పుడిప్పుడే మళ్లీ వ్యాపారం కోలుకుంటోందని రకుల్ చెప్పుకొచ్చింది. బిజినెస్ అన్నాక.. నష్టాలుంటాయి మరి. తట్టుకోవాల్సిందే.