ఈమధ్య బయోపిక్‌ల హంగామా ఓ రేంజ్ లో సాగుతోంది. ప్రతీ హీరో, ప్రతీ హీరోయిన్.....ఆశ ఇదే. రాజకీయ నాయకులు, సినీ స్టార్లు, ఆటగాళ్లు, వ్యాపార వేత్తలు, డాన్‌లు, స్మగ్లర్లు, దొంగలు - ఇలా కాదేదీ బయోపిక్ కి అనర్హం అన్నట్టుగా మారడంతో - బోలెడన్ని కథలు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కరణం మల్లీశ్వరీ బయోపిక్ కూడా సెట్స్‌పైకి వెళ్లబోతోంది. మల్లీశ్వరి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటించబోతోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. రకుల్ కి ఫిట్ నెస్ పై శ్రద్ధ ఎక్కువ. తన బాడీ సరిగా సరిపోతుంది కూడా. అందుకే ఆ పాత్రలో తాను న్యాయం చేయగలదు అని అంతా ఫిక్సయ్యారు.
కానీ దీనిపై ఇప్పుడు రకుల్ స్పందించింది. కరణం మల్లీశ్వరి బయోపిక్ చేయడం లేదని క్లారిటీ ఇచ్చింది. అలాంటి కథేదీ వినలేదని చెప్పుకొచ్చింది. ``బయోపిక్ లు చేయడం ఇష్టమే. కానీ నా దగ్గరకు అలాంటి కథలేమీ రాలేదు. భవిష్యత్తులో వస్తే చేస్తానేమో? ఓటీటీపై కూడా దృష్టి పెట్టాల్సిన సమయం ఇది. అయితే ఓటీటీలో చేస్తే సమ్ థింగ్ స్పెషల్ అనిపించేలా ఉండాలి. రెగ్యులర్ కథలతో సినిమాలు చేయకూడదు`` అని చెప్పుకొచ్చింది రకుల్.