రకుల్‌ ఖాతాలో ఇంకో దేశభక్తి చిత్రం.!

By Inkmantra - November 07, 2019 - 12:00 PM IST

మరిన్ని వార్తలు

రకుల్‌ ప్రీత్‌సింగ్‌కి టాలీవుడ్‌లో అరకొర అవకాశాలే దక్కుతున్నా, నార్త్‌లో మాత్రం బాగానే అందుతున్నాయి. బోణీ బాగోలేకపోయినా, ప్రస్తుతం బాలీవుడ్‌లో చాలా సినిమాల స్క్రిప్టులు వింటోందట రకుల్‌. ఆ క్రమంలో తాజాగా ఆమె ఖాతాలో ఓ కొత్త ప్రాజెక్ట్‌ వచ్చి చేరింది. యంగ్‌ హీరో అర్జున్‌ కపూర్‌తో ఓ కొత్త ప్రాజెక్ట్‌కి సైన్‌ చేసింది రకుల్‌. కాశ్వీ నాయర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని లేటెస్ట్‌గా చిత్ర యూనిట్‌ అనౌన్స్‌ చేసింది. ఈ ఛాన్స్‌ తనకు గోల్డెన్‌ ఛాన్స్‌ అంటోంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.

 

'ఇది నా కొత్త ప్రయాణం, ఖచ్చితంగా ప్రతీ భారతీయుడికీ కనెక్ట్‌ అవుతుంది..' అంటూ రకుల్‌ ఈ సందర్భంగా ట్వీట్‌ చేసింది. అంటే, ఈ సినిమా దేశభక్తి కథాంశంగా తెరకెక్కుతోందని అర్ధమవుతోంది. ఇప్పటికే దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతోన్న 'ఇండియన్‌ 2' చిత్రంలో రకుల్‌ నటిస్తోంది. విశ్వ నటుడు కమల్‌ హాసన్‌ లీడ్‌ రోల్‌ పోషిస్తున్న ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ మెయిన్‌ హీరోయిన్‌ కాగా, రకుల్‌ సెకండ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. సిద్ధార్ద్‌కి జోడీగా రకుల్‌ పాత్ర ఉండనుందని తెలుస్తోంది.

 

సో రకుల్‌ చేతిలో ప్రస్తుతం రెండు దేశ భక్తి సంబంధిత సినిమాలున్నాయన్నమాట. మరోవైపు బాలీవుడ్‌లో రకుల్‌ నటించిన 'మార్జవాన్‌' చిత్రం ఈ నెల 8న విడుదలకు సిద్ధంగా ఉంది. తమిళంలో రకుల్‌ ఓ సినిమాలో నటిస్తోంది. తెలుగులోనూ ఓ సినిమా కోసం నితిన్‌తో జత కడుతోంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS