'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' సినిమాతో తెలుగు నాట సూపర్ హిట్ కొట్టిన రకుల్ ప్రీత్ సింగ్, కెరీర్‌లో చాలా తెలుగు సినిమాలే చేసేసింది. సూపర్ స్టార్ మహేష్ సరసన నటించింది.. పలువురు యంగ్ హీరోలతోనూ సక్సెస్‌లు కొట్టింది. నిజానికి, రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ ఎత్తుపల్లాల నడుమ సాగిందన్నది నిర్వివాదాంశం. కింద పడ్డ ప్రతిసారీ బౌన్స్ బ్యాక్ అవుతూనే వచ్చింది రకుల్.
మామూలుగా అయితే, గట్టి ఫ్లాప్ వచ్చాక మళ్ళీ కోలుకోవడం కష్టం. కానీ, రకుల్ అలా కాదు. హిట్టూ, ఫ్లాపూ.. మళ్ళీ హిట్టు.. ఇలా సాగింది ఆమె ప్రయాణం. వరుస ఫ్లాపులు వచ్చినా, 'రకుల్ పనైపోయింది' అని చాలామంది అనుకున్నా, రకుల్ ప్రయాణం మాత్రం ఆగలేదు. ఇప్పటికీ స్టార్ హీరోయిన్‌గా ఆమె ఇమేజ్ అలానే వుంది. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది రకుల్. అందులో నితిన్ సరసన నటిస్తోన్న సినిమా ఒకటి. 'చెక్' పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాలో అడ్వొకేట్ పాత్రలో కన్పించబోతోంది రకుల్ ప్రీత్ సింగ్.
టాలీవుడ్ మాత్రమే కాదు, బాలీవుడ్‌లోనూ, కోలీవుడ్‌లోనూ రకుల్ కెరీర్ స్టడీగానే వుంది. ఇన్నేళ్ళ ఈ కెరీర్ గురించి రకుల్ మాట్లాడుతూ, 'తెలుగు సినిమాతో తనకు స్టార్‌డమ్ దక్కిందనీ, తాను తెలుగమ్మాయిలా మారిపోయాననీ చెప్పింది. అదే సమయంలో నన్ను తమిళ ప్రేక్షకులూ ఆదరించారు. బాలీవుడ్ కూడా అక్కున చేర్చుకుంది..' అని చెప్పింది. హిట్టు వచ్చినప్పుడూ, ఫెయిల్యూర్ వచ్చినప్పుడూ ఒకే దృక్పథంతో వుండడమే తన సక్సెస్ సీక్రెట్ అని అంటోంది రకుల్ ప్రీత్ సింగ్. అదీ నిజమే.