కథానాయికలు సర్జరీలు చేసుకుని తమ రూపు రేఖల్ని మార్చుకునే ప్రయత్నం చేయడం చాలా సాధారణమైన విషయం. అయితే కొన్నిసార్లు సర్జరీల వల్ల మేలు జరక్కపోగా, కొత్త అందం రాకపోగా - ఉన్న అందం పోతుంది. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ విషయంలోనూ అదే జరిగిందా? అనేది ఇండ్రస్ట్రీ వర్గాలు, ఆమె అభిమానుల అనుమానం.
ఇటీవల రకుల్ సోషల్ మీడియాలో ఓ ఫొటో పోస్ట్ చేసింది. చూడగానే `ఈమె ఎవరు` అనిపించేలా ఉంది ఆ ఫొటో. కానీ అది రకుల్ దే. రకుల్ రూప లావణ్యాలు హఠాత్తుగా మారిపోవడం అభిమానులకు షాకిచ్చే విషయం. రకుల్ పెదాలు మరీ దారుణంగా తయారయ్యాయి. దానికి కారణం సర్జరీనే అనేది ఇన్ సైడ్ వర్గాల టాక్. ఇటీవల రకుల్ సర్జరీ చేయించుకుందని, అది కాస్త వికటించిందని చెప్పుకుంటున్నారు. పైగా రకుల్ కి ఫిట్ నెస్ పై శ్రద్ధ ఎక్కువ. ఎక్సర్ సైజులు చేసి చేసీ మరీ స్లిమ్ గా మారిపోయింది. బుగ్గలు నొక్కుకుపోయాయి. దాంతో ఆమె గ్లామర్ మరింత తగ్గిపోయింది. ఇప్పటికే రకుల్ కి పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఇలాగైతే... పూర్తిగా ఆమెని పట్టించుకోవడం మానేస్తారేమో అనిపిస్తోంది. తను నటించిన కొండపొలం త్వరలోనే విడుదల కానుంది. ఆ ప్రచార చిత్రాల్లోమాత్రం రకుల్ చూడముచ్చటగానే ఉంది. కొండ పొలం షూటింగ్ పూర్తయిన తరవాతే.. రకుల్ సర్జరీ చేయించుకుందేమో..?