తెలుగులో స్టార్ హీరోయిన్ అనిపించుకున్న రకుల్ ప్రీత్‌సింగ్, కెరీర్ ఫుల్ స్వింగ్‌లో ఉన్న తరుణంలో బాలీవుడ్‌పై కన్నేసింది. బాలీవుడ్‌లో అడుగు పెట్టాక, తెలుగులో ఆమె గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. ఆ గ్రాఫ్‌ని సెట్ చేసుకోవడం మళ్లీ రకుల్ వల్ల కాలేదు. దాంతో బాలీవుడ్‌లోనే దక్కిన ఒకటీ, అరా అవకాశాల్ని పట్టుకుని అక్కడే ఉండిపోవాలనుకుంది. రకుల్ నటించిన రెండో సినిమా 'దేదే ప్యార్‌దే' విడుదలకు ముందు సంచలనమైనా, విడుదలయ్యాక అస్సలు సోదిలో లేకుండా పోయింది. ఆ తర్వాత తెలుగులోనూ అదే తరహా చిత్రం 'మన్మధుడు 2'లో నటించింది కానీ, ఆకట్టుకోలేకపోయింది.
ఆ తర్వాత మళ్లీ బాలీవుడ్‌లో 'మార్జవాన్' చిత్రంలో నటించిన రకుల్ ఆ సినిమాతోనూ చేదు అనుభవమే చవి చూసింది. ఇక ఇప్పుడు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రకుల్ సందడి బాగానే ఉంది. తెలుగు లో నితిన్ 'చదరంగం' లో నటిస్తోంది. తమిళంలో విశ్వ నటుడు కమల్ హాసన్ చిత్రం 'ఇండియన్ 2'లో నటిస్తోంది. ఇక హిందీ విషయానికి వస్తే, రకుల్ చేతిలో ప్రస్తుతం రెండు ప్రాజెక్టులున్నాయి.
యంగ్ హీరో అర్జున్ కపూర్‌తో ఓ సినిమాలో నటిస్తున్న రకుల్, తాజాగా జాన్ అబ్రహాం సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. అయితే, ఈ సినిమాలో రకుల్ సెకండ్ హీరోయిన్‌గా నటిస్తోంది. అందాల భామ జాక్వెలైన్ ఫెర్నాండ్‌జ్ లీడ్ రోల్ పోషిస్తోంది. లక్ష్యరాజ్ ఆనంద్ ఈ సినిమాకి దర్శకుడు. వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది ఈ సినిమా.