తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఓ రేంజ్ క్రేజ్ సంపాదించిన రకుల్ ప్రీత్‌సింగ్‌ని ఇప్పుడు తెలుగులో పెద్దగా పట్టించుకోవడం లేదు. ఏదో అరా కొరా అవకాశాలతో సరిపెట్టుకుంటోంది. బాలీవుడ్‌కి వెళ్లాక రకుల్ కెరీర్ అగమ్యగోచరంగా మారిపోయింది. తెలుగులో ప్రస్తుతం రకుల్ చేతిలో నితిన్ సినిమా ఒక్కటే ఉంది. ఫ్యూచర్‌లో రకుల్‌కి ఛాన్స్ దక్కుతుందనడానికి కూడా అవకాశాల్లేవు. దాంతో బాలీవుడ్‌లోనే సెటిలవ్వాలనుకుంటోందట. అక్కడ రకుల్ చేతిలో రెండు చిత్రాలున్నాయి. ఆల్రెడీ రెండు చిత్రాల్లో నటించి ఓకే అనిపించుకుంది. తమిళంలోనూ రకుల్ పరిస్థితి ఇదే.
ఈ తరుణంలో రకుల్ ప్రయోగాలు చేస్తానంటోంది. విలక్షణ పాత్రలు ఎంచుకుంఓటానంటోంది. ఇంతవరకూ కెరీర్‌లో రకుల్ ప్రీత్‌సింగ్ చేసిన సాహసాలేం లేవనే చెప్పాలి. స్కిన్ షోతో గ్లామర్ తారగానే చెలామణీ అయ్యింది. కానీ, కీర్తిసురేష్, నివేదా థామస్, సాయి పల్లవి తదితర హీరోయిన్లు స్కిన్ షో కన్నా, పాత్రల ప్రాధాన్యతకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. వారిలాగే రకుల్ కూడా దక్షిణాదిలో ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలకు ప్రాధాన్యత ఇస్తానంటోంది. అయితే, నార్త్‌లో మాత్రం స్కిన్ షోకి సై అంటోంది. ఏది ఏమైనా రకుల్ ఏదో చేయాలనుకుంటోంది. ఓకే.. కేరీ ఆన్.