ఫిట్‌నెస్‌లో ఎప్పుడూ టాప్ లెవల్లో ఉండే రకుల్ ప్రీత్‌సింగ్, కరోనా కారణంగా ఇంట్లోనే ఉంటున్న వారికి కొన్ని టిప్స్ చెబుతోంది. యోగాకీ, జిమ్‌కీ ఉండే డిఫరెన్స్ గురించి అవేర్‌నెస్ పెంచే ప్రయత్నం చేస్తోంది. నిజానికి యోగా, ప్రాణాయామం అనేవి, బాడీకి ఫ్లెక్సిబులిటీని ఇస్తాయట. అలాగే, మానసిక ధృడత్వాన్ని పెంచుతాయట. కానీ, బరువు తగ్గాలనుకుంటే మాత్రం జిమ్ చేయాల్సిందే.. అంటోంది అందాల రకుల్ ప్రీత్ సింగ్. యోగా చేసినంత మాత్రాన బరువు తగ్గిపోరని ఖచ్చితంగా చెబుతోంది. అలాగే, యోగా చేసినా, జిమ్ చేసినా డైట్ విషయంలోనూ కొన్ని నియమాల్ని పాఠించాలని సూచిస్తోంది.
జిమ్ చేసి వచ్చిన వెంటనే ఫ్రూట్ జ్యూస్ అస్సలు తీసుకోకూడదని రకుల్ చెబుతోంది. ఎందుకంటే, ఫ్రూట్ జ్యూస్‌లోని షుగర్ కంటెంట్ మనం చేసిన జిమ్‌కి యాంటీగా వర్క్ చేస్తుందట. తద్వారా బరువు తగ్గడం సాధ్యం కాదని చెబుతోంది. కరోనా కారణంగా ప్రస్తుతం జనమంతా ఇళ్లకే పరిమితమైపోయారు. శరీరానికి తగినంత కష్టం కూడా లేకుండా పోయింది. సో రకుల్ వంటి యోగా లేదా జిమ్ స్పెషలిస్టులు అనుభవపూర్వకంగా చెప్పే ఈ టిప్స్‌ని పాఠిస్తూ, ఇంట్లోనే చిన్నా, చితకా వ్యాయామాలు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిదేగా.