గ్లామ్‌షాట్‌: యోగా బ్యూటీ రకుల్‌..అదిరేలా బ్యూటిఫుల్‌ ఫీట్‌!

మరిన్ని వార్తలు

రకుల్‌కి తన శరీరాన్ని ఎప్పుడూ ఫిట్‌గా ఉంచుకోవడమంటే ఇష్టం. అందుకే ప్రతీరోజూ తన రోజును వ్యాయామం, యోగాతోనే స్టార్ట్‌ చేస్తుందట. ప్రతీ రోజు ఒక్క గంటైనా యోగా చేయకుంటే, రకుల్‌కి తిన్నది అరగదట. కంటికి నిద్ర కూడా పట్టదట. యోగాని తన లైఫ్‌ స్టైల్‌లో ఆ రేంజ్‌లో భాగం చేసుకుంది కాబట్టే, ఆమె ఫిట్‌నెస్‌లో ఎప్పుడూ టాప్‌ లెవల్లోనే ఉంటుంది. యోగాలో ఎలాంటి ఫీట్స్‌ అయినా సునాయాసంగా వేసేసే ఫ్లెక్సిబుల్‌ బాడీ రకుల్‌ సొంతం.

 

తాజాగా రకుల్‌ యోగా ఫీట్‌ ఒకటి నెట్టింట్లో వైరల్‌ అయ్యింది. బ్లాక్‌ స్లీవ్‌లెస్‌ టాప్‌ అండ్‌, గ్రే కలర్‌ జగ్గింగ్‌లో నేలపై పడుకుని, రెండు చేతులపై ఫ్రంట్‌ బాడీని పైకెత్తి, కళ్లు మూసుకుని యోగ ముద్రలో కనిపిస్తోంది ఈ ఫోటోలో రకుల్‌. ఫిట్‌ అండ్‌ పర్‌ఫెక్ట్‌గా కనిపిస్తున్న ఈ ఫోటోకి నెటిజన్స్‌ నుండి రకరకాల కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. మీరు కూడా ఈ పిక్‌పై ఓ లుక్కేసి, మీకు నచ్చిన కామెంట్‌ ఏదో ఒకటి పోస్ట్‌ చేసుకోండి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS