సోషల్‌ మీడియాలో రకుల్‌కి చేదు అనుభవం

మరిన్ని వార్తలు

సోషల్‌ మీడియా వచ్చాక నెటిజన్స్‌కి భావ ప్రకటనా స్వేచ్ఛ శృతి మించిపోతోంది. ముఖ్యంగా సెలబ్రిటీస్‌ విషయంలో నెటిజన్లు హద్దులు మీరుతున్నారు. తాజాగా రకుల్‌ ప్రీత్‌సింగ్‌కి ఓ చేదు అనుభవం ఎదురైంది. కారులోంచి దిగిన రకుల్‌ పిక్‌కి సోషల్‌ మీడియాలో ఓ నెజిటన్‌ నుండి అసభ్యకర కామెంట్స్‌ ఎదురయ్యాయి. ఈ పిక్‌లో రకుల్‌ విత్‌ అవుట్‌ బోటమ్‌లా కనిపించింది. దానికే ఆ నెటిజన్‌ కామెంట్‌ పెట్టాడు. 

 

ఆ కామెంట్‌ చూసిన రకుల్‌ దిమ్మ తిరిగిపోయేలా రీ కౌంటర్‌ ఇచ్చింది. ఆ నెటిజన్‌ తల్లిని అవమానించేలా మాట్లాడింది. దాంతో రకుల్‌ కామెంట్‌పై ఒకింత నెగిటివ్‌ ఇంపాక్ట్‌ ఏర్పడింది. అలాంటి డ్రస్సు వేసుకుని రావడమే తప్పంటే, మళ్లీ ఆ పిక్‌ పోస్ట్‌ చేయడం, తద్వారా వచ్చిన కామెంట్‌ని స్వీకరించకపోవడం సరికదా, తిరిగి ఓ తల్లిని అవమానించేలా మాట్లాడడంతో రకుల్‌పై విమర్శలు గుమ్మెత్తుతున్నాయి. 

 

అసలే రకుల్‌ప్రీత్‌సింగ్‌కి ఈ మధ్య ఇలాంటి నెగిటివ్‌ కామెంట్లు చాలా చాలా ఎక్కువయ్యాయి. ఈ తరుణంలో ఇలా స్వయంగా వివాదాలు కోరి తెచ్చుకోవడం ఏమీ బాగోలేదని ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు. తెలుగులో ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా అభిమానించిన వారికే ఇప్పుడు రకుల్‌ అంటే పడట్లేదు. అసలే అవకాశాలు అంతంత మాత్రంగా ఉన్న రకుల్‌ ఇలా చీప్‌గా నోరు పారేసుకోవడం ఎంత మాత్రమూ భావ్యంగా లేదు సుమీ. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS