రకుల్‌ని అందుకే లీక్‌ చేయలేదట!

మరిన్ని వార్తలు

రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ప్రస్తుతం 'మన్మధుడు 2' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన టీజర్‌లో రకుల్‌ని ఎక్కడా రివీల్‌ చేయలేదు. రేపు అనగా జూలై 9న రకుల్‌ క్యారెక్టర్‌కి సంబంధించిన లుక్‌ రివీల్‌ చేయనున్నామని అఫీషియల్‌గా ప్రకటించింది చిత్ర యూనిట్‌. ఈ సినిమాలో రకుల్‌ 'అవంతికా' పాత్రలో కనిపించనుందంటూ ఆమె పేరుతో కూడిన ఓ లోగో పోస్టర్‌ రిలీజ్‌ చేశారు.

 

'చిలసౌ' ఫేం రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆగస్ట్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇటీవల విడుదలైన 'మన్మధుడు 2' టీజర్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే. కానీ, ఆ టీజర్‌లో హీరోయిన్‌ రకుల్‌కి చోటు దక్కలేదు. అయితే, అప్పుడు రకుల్‌ని ఎందుకు రివీల్‌ చేయలేదో ఇప్పుడు అర్ధమైంది కదా. ఇదిగో ఇలా రకుల్‌కి స్పెషల్‌ ఇంట్రడ్యూస్‌ ప్లాన్‌ చేశారు మరి. ఇకపోతే, టీజర్‌లో నాగార్జున హ్యాండ్‌సమ్‌ లుక్స్‌, కామెడీ టైమింగ్‌ చూశాక, అక్కినేని అభిమానులు సినిమాపై ఓ అభిప్రాయానికి వచ్చేశారు. మరోవైపు ఈ సినిమాలో రకుల్‌తో పాటు, కీర్తి సురేష్‌ కూడా మరో హీరోయిన్‌గా నటిస్తుండడం అదనపు ఆకర్షణ. ఆల్రెడీ కీర్తిసురేష్‌, నాగార్జున కాంబినేషన్‌లో ఓ రొమాంటిక్‌ స్టిల్‌ విడుదలై హ్యూజ్‌ రెస్పాన్స్‌ అందుకుంది.

 

అయితే, రకుల్‌, నాగార్జున కాంబో స్టిల్స్‌ ఇంకా రాలేదు. ఒకటీ అరా, ఆన్‌ లొకేషన్‌ స్టిల్స్‌ తప్ప వీరి మధ్య అఫీషియల్‌ రొమాంటిక్‌ స్టిల్స్‌ బయటికి రాలేదింతవరకూ. సో 'అవంతిక'గా రేపు రానున్న రకుల్‌ ప్రీత్‌ లుక్స్‌ ఎలా ఉండబోతున్నాయో చూడాలి మరి. తెలుగులో పూర్తి స్థాయి హీరోయిన్‌గా రకుల్‌ రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకుంది రకుల్‌. ఈ సినిమాని వెరీ వెరీ ప్రెస్జీజియస్‌గా తీసుకుంది. ఈ సినిమా గానీ హిట్‌ అయ్యిందంటే, టాలీవుడ్‌లో ఆమె పోగొట్టుకున్న స్టార్‌ ఇమేజ్‌ మళ్లీ దక్కించుకోవడం ఖాయం. చూడాలి మరి ఏం జరుగుతుందో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS