ఐటెం సాంగ్స్‌కి సై అంటోన్న రకుల్‌?

మరిన్ని వార్తలు

తెలుగులో నిన్న మొన్నటిదాకా నెంబర్‌ వన్‌ హీరోయిన్‌ ఎవరంటే, ఠక్కున రకుల్‌ ప్రీత్‌సింగ్‌ పేరే చెప్పేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒకటి రెండు ఫ్లాప్‌ల సంగతి పక్కన పెడితే, ఎందుకో రకుల్‌కి తెలుగులో ఆశించిన అవకాశాలు రావట్లేదు. తమిళంలో మాత్రం బిజీగా ఉంది. హిందీలోనూ సినిమాలు చేస్తోంది. 

తెలుగులో మళ్లీ సత్తా చాటేందు కోసం, రెమ్యునరేషన్‌ తగ్గించుకుని, సినిమాలు చేయడానికి రకుల్‌ రెడీ అయిపోయింది. అంతేకాదు, స్పెషల్‌ సాంగ్స్‌ కూడా చేస్తానని రకుల్‌ అంటోందట. రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌ ఇలా చెప్పుకుంటూ పోతే, టాలీవుడ్‌లో రకుల్‌కి చాలా మంది హీరోలతో మంచి ఫ్రెండ్‌షిప్‌ ఉంది. ఆ స్నేహం కారణంగానే రకుల్‌కి తెలుగులో అవకాశాలు మళ్లీ రావచ్చని అనుకోవచ్చు. రకుల్‌ మాత్రం తన టాలెంటే తనకి అవకాశాలు తెచ్చిపెడుతుందని ధీమా వ్యక్తం చేస్తోంది. 

అవకాశాల్లేని పరిస్థితి తనకెప్పుడూ రాలేదనీ, రాబోదనీ, చెబుతున్న రకుల్‌ తమిల, హిందీ సినిమాలతో బిజీగా ఉండడం వల్లే, తెలుగు సినిమాల్లో తక్కువగా కనిపించలేకపోతున్నానని వివరించింది. ఐటెం సాంగ్స్‌ చేయడం తప్పేం కాదనీ, నటనలో అదీ ఒక భాగమే అని చెప్పడంతో త్వరలోనే రకుల్‌ స్పెషల్‌ సాంగ్స్‌లో కనిపించబోతోందని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS