తమ్ముడినే కాదు అన్నయ్యనీ ముంచేసిన రకుల్‌!

మరిన్ని వార్తలు

రకుల్‌ ఖాతాలో మరో డిజాస్టర్‌ పడింది. ఈ మధ్య రకుల్‌ ఏ సినిమాలో నటించినా ఆ సినిమా ఖచ్చితంగా ఫ్లాప్‌ అయ్యి తీరుతుంది. వరుసగా ఇదే జరుగుతుండడంతో ఈ సెంటిమెంట్‌ జనాల్లో బాగా నలిగిపోయింది. ఇక తాజాగా రకుల్‌ నటించిన 'ఎన్‌జీకీ' చిత్రం మరోసారి ఇదే విషయాన్ని ప్రూవ్‌ చేసేసింది. ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకి దారుణమైన రిపోర్ట్స్‌ వస్తున్నాయి. ఇదంతా రకుల్‌ లెగ్‌ మహిమే అంటున్నారు.

 

గతంలో కార్తితో రకుల్‌ నటించిన 'ఖాకీ' సినిమా ఓకే అనిపించినా, ఆ తర్వాత ఇదే కాంబోలో తెరకెక్కిన 'దేవ్‌' దారుణంగా పరాజయాన్ని చవిచూసింది. అయితే ఆ సినిమా డిజాస్టర్‌ అయినా, చెప్పుకోవడానికి కొన్ని ఆశక్తికరమైన సీన్లున్నాయన్నది సినిమా చూసిన వారు కాస్తో కూస్తో ముచ్చటించుకున్న మాట. కానీ, 'ఎన్‌జీకే' మౌత్‌ టాక్‌ మాత్రం అస్సలేం బాగా రావడం లేదు. తమిళంలో పరిస్థితి ఎలా ఉందో ఇంకా పూర్తి సమాచారమ్‌ రాలేదు. కానీ, తెలుగులో మాత్రం నెగిటివ్‌ టాక్‌ వచ్చేసింది. ఓపెనింగ్స్‌ ఆశించిన స్థాయికి చాలా దూరంలోనే ఆగిపోయాయ్‌. సినిమాలో అస్సలు విషయం లేదనే టాక్‌ నడుస్తోంది.

 

సెల్వ రాఘవన్‌ నుండి వచ్చిన సినిమానేనా ఇది.? అని అభిమానులు వాపోతున్నారు. సూర్య గత చిత్రం 'గ్యాంగ్‌' కూడా తెలుగులో ఆశించిన స్థాయి విజయం అందుకోలేకపోయింది. బ్యాక్‌ టు బ్యాక్‌ ఈ సినిమాకీ అలాంటి రిపోర్టే వస్తోందంటే, టాలీవుడ్‌లో సూర్య మార్కెట్‌కి గండి పడడం ఖాయమే. మొత్తానికి రకుల్‌ పుణ్యమా అని ఈ ఇద్దరు అన్నదమ్ములూ వరుసగా పరాజయాల పాలయ్యారంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు. అయినా సినిమాలో విషయం లేకపోతే, రకుల్‌ ఏం చేస్తుంది పాపం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS