టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ దర్శకుడిగా మారిపోయాడు.. అనిల్ రావిపూడి. వరుసగా 5 సూపర్ హిట్లతో... తనకంటూ ఓ స్థాయి తెచ్చుకున్నాడు. బడా హీరోలు, కుర్ర కథానాయకులు... అనిల్ రావిపూడితో సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రస్తుతం.. ఎఫ్ 3తో బిజీగా ఉన్నాడు అనిల్ రావిపూడి. ఈ యేడాదే ఈ సినిమా విడుదల కానుంది. ఎఫ్ 2 కంటే.. రెట్టింపు వినోదం ఈ సినిమాతో ఇవ్వడానికి ఫిక్సయ్యాడు రావిపూడి. తన దృష్టంతా ఈసినిమాపైనే ఉంది.
అయితే.. ఇప్పుడు.. రామ్ కోసం ఓ సినిమా చేయడానికి ప్రయత్నాలు మొదలెట్టాడని తెలుస్తోంది. లాక్ డౌన్ సమయంలో.. అనిల్ రావిపూడి ఓ కొత్త కథ రాసుకున్నాడట. ఆ కథ రామ్ కి అయితే బాగా సరిపోతుందని భావించాడని టాక్. రామ్ కూడా రావిపూడితో సినిమా చేయాలని ఉత్సాహం చూపిస్తున్నాడు. ఇటీవల కొంతమంది యువ దర్శకులకు రామ్ పార్టీ ఇచ్చాడు.
ఆ పార్టీలో అనిల్ రావిపూడి కూడా ఉన్నాడు. అప్పటి నుంచీ ఈ ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి. లేటెస్టుగా వీరిద్దరూ సినిమా చేయడానికి గట్టిగా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఎఫ్ 3 అయ్యాకే ఈ సినిమా ఉండబోతోంది.