మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కొత్త సినిమా 'రంగస్థలం' మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే, రెండ్రోజుల్లో సినిమా థియేటర్లలో సందడి చేయబోతోంది. ఏ హీరోకి అయినా ఇది చాలా పెద్ద టెన్షన్‌తో కూడుకున్న వ్యవహారం. కానీ, చరణ్‌కి 'రంగస్థలం' కంటే పెద్ద టెన్షన్ ఇంకోటుంది. అదే 'సైరా నరసింహారెడ్డి'.
ఈ సినిమా తాజా షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఈరోజు నుంచి బిగ్-బి అమితాబ్ బచ్చన్, షూటింగ్‌కి హాజరు కానున్నారు. అదే చరణ్‌కి అతి పెద్ద టెన్షన్. అనారోగ్యంతో బాధపడుతున్న అమితాబ్ కారణంగా, షెడ్యూల్ కొంత ఆలస్యం జరిగినట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు బిగ్-బి షూటింగ్‌కి హాజరు కానుండడంతో చరణ్‌కి పెద్ద టెన్షన్ తగ్గిందట. అదీ తన పుట్టినరోజునాడే ఆ టెన్షన్ నుంచి విముక్తి లభించడంతో చరణ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న 'సైరా నరసింహారెడ్డి' చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రామ్‌చరణ్ నిర్మిస్తోన్న సంగతి తెల్సిందే. సురేందర్‌రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పుడు జరుగుతున్న షెడ్యూల్ సినిమాలో కీలకమైన 'పార్ట్' అట. అమితాబ్ బచ్చన్ గెటప్‌ని డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు. 'ఆ గెటప్ ఇలా వుండబోతోంది' అంటూ అమితాబ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫొటో వైరల్‌గా మారిన సంగతి తెల్సిందే. అయితే అది ఫైనల్ గెటప్ కాదు. ఇప్పుడు అమితాబ్ షూటింగ్‌కి హాజరవడం, కొత్త గెటప్‌లోకి ఒదిగిపోవడం.. అదంతా చరణ్ పర్యవేక్షణలోనే జరగనున్నట్లు తెలుస్తోంది. 'సైరా' సందడిలో పడి చరణ్, తన 'రంగస్థలం' సినిమా ప్రమోషన్స్‌ని పూర్తిస్థాయిలో చేసుకోలేకపోతున్నాడట.