'మెగా, పవర్‌' ఈ బంధం దృఢమైనది

మరిన్ని వార్తలు

మెగాస్టార్‌ చిరంజీవి కుటుంబం నుంచి పవర్‌ స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ వేరుపడ్డాడనే ప్రచారం చాలాకాలంగా జరుగుతున్న సంగతి తెల్సిందే. మెగా కాంపౌండ్‌లో ఇప్పుడెక్కడా పెద్దగా పవన్‌కళ్యాణ్‌ పేరు విన్పించడంలేదు. చరణ్‌ సినిమా 'రంగస్థలం' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి హాజరు కాని పవన్‌కళ్యాణ్‌, నితిన్‌ సినిమా 'ఛల్‌ మోహనరంగ' ఈవెంట్‌లో ప్రత్యక్షమయి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇది పవన్‌కళ్యాణ్‌కి కొత్తేమీ కాదు.

 

అయినాగానీ, చరణ్‌ తన బాబాయ్‌ విషయంలో ఇంకా అదే పాజిటివ్‌ కార్నర్‌తో వున్నాడు. 'నాన్న, బాబాయ్‌.. ఇద్దరూ ఎప్పుడూ విడిపోరు. అది విడిపోయే బంధం కానే కాదు. ప్రతిసారీ అన్నయ్య మీద తమ్ముడు తన ప్రేమని అందరికీ తెలిసేలా చాటుకోవాలనుకోవడమేంటి?' అని పవన్‌ ప్రశ్నించాడు. బాబాయ్‌ ఎప్పుడూ, మెగాస్టార్‌ చిరంజీవికి ముద్దుల తమ్ముడే.. బాబాయ్‌ పట్ల నాకున్న అభిమానం, నా పట్ల బాబాయ్‌కి వున్న ప్రేమ ఇప్పటికీ తగ్గవని చెప్పాడు చరణ్‌. 

మెగా కాంపౌండ్‌లో ఎప్పటికీ విభేదాలుండవనీ, ఎవరి కెరీర్‌, ఎవరి ఆలోచనలు వారికి వుండడం తప్పేమీ కాదనీ, అంతిమంగా కుటుంబంలో ప్రతి ఒక్కరి అభిప్రాయానికీ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ సముచిత గౌరవం ఇస్తారనీ పవన్‌ చెప్పాడు. మెగాస్టార్‌, పవర్‌ స్టార్‌.. ఈ రెండూ కలిస్తే 'మెగా పవర్‌ స్టార్‌' అది నేనే. నా వరకూ నేనెప్పుడూ బాబాయ్‌కి దూరంగా వుండాలని అనుకోనని చరణ్‌ క్లారిటీ ఇచ్చేశాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS