మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్‌తేజ, తన బాబాయ్ పవన్‌కళ్యాణ్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. పవన్‌కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి మద్దతుగా సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ కామెంట్ పోస్ట్ చేశాడు. 'జై జనసేన' అంటూ చరణ్ పేర్కొనడం గమనించదగ్గ అంశమిక్కడ.
తన తండ్రి చిరంజీవి కాంగ్రెస్ నేత అయినప్పటికీ, మెగా కాంపౌండ్ మొత్తం చిరంజీవి వెంటే ఉంటుందని నాగబాబు సహా పలువురు మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఇదివరకు చెప్పినా, ఇప్పుడీ కొత్త మెగాపవర్ నినాదం అభిమానుల్ని ఆనందపెడుతున్నా, కొంత గందరగోళానికి గురిచేసిందని చెప్పక తప్పదు. అయితే మెగాస్టార్ చిరంజీవి త్వరలో జనసేన పార్టీలో చేరబోతున్నారడానికి ఇదొక సంకేతంగా కూడా అభిమానులు భావిస్తున్నారట.
కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా చిరంజీవి పనిచేస్తున్నారు. ఆ పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఆ తర్వాతే ఆయన జనసేనలోకి వెళతారేమో. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు, ఆ పార్టీలో ముఖ్య భూమిక పోషించారు పవన్‌కళ్యాణ్. అయితే అనుకున్న స్థాయిలో ప్రజారాజ్యం పార్టీ తెలుగునాట నిలదొక్కుకోలేకపోయింది. దాంతో ప్రజారాజ్యాన్ని చిరంజీవి, కాంగ్రెస్‌లో కలిపేశారు. ఆ కలయిక పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ, చిరంజీవికి సైతం పవన్ దూరమయ్యారన్న భావన అభిమానుల్లోనూ ఉంది.
అన్నదమ్ములు మళ్ళీ ఒక్కటై, జనసేనని ముందుకు నడిపితే, అభిమానుల మధ్య గ్యాప్ కూడా మాయమైపోయే అవకాశముందని చెప్పవచ్చు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్, నిన్న తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులోని ఆంజనేయస్వామిని దర్శించుకుని, రాజకీయ యాత్ర ప్రారంభించిన సంగతి తెలిసినదే. 'ఛలోరె ఛలోరే' పేరుతో ఈ యాత్రను ఆయన ప్రారంభించగా, అత్యద్భుతంగా యాత్ర ప్రారంభమయ్యిందని మెగాపవర్‌స్టార్ పేర్కొంటూ, పవన్‌కళ్యాణ్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. 'జై జనసేన' అంటూ నినదించారాయన.