నా వయసు ఆ పాత్రకు సరిపోదు - రామ్‌ చరణ్‌

By iQlikMovies - May 25, 2018 - 11:51 AM IST

మరిన్ని వార్తలు

ఇటీవల 'రంగస్థలం' సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టిన మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ లాంగ్‌ గ్యాప్‌ తర్వాత వాణిజ్య ప్రకటనలో కనిపించబోతున్నాడు. 'హ్యాపీ మొబైల్స్‌'కి రామ్‌చరణ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. 18 నెలల పాటు ఈ సంస్థ తరపున రామ్‌చరణ్‌ ప్రచార కర్తగా వ్యవహరించనున్నారు.

కాగా ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రామ్‌చరణ్‌ కొన్ని ఆశక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు.ఇటీవల మహేష్‌బాబు హీరోగా 'భరత్‌ అనే నేను' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఆ తరహాలో రాజకీయ నాయకుడి పాత్రలో మీరు నటిస్తారా? అని చరణ్‌ని అడిగితే, 'అలాంటి పాత్రలో నటించేందుకు ఇప్పుడప్పుడే నా వయసు సరిపోదు.

అయినా ఇప్పుడే కదా మహేష్‌ నటించాడు. అప్పుడే ఇంకెవరైనా అదే పాత్రలో కనిపిస్తే ఆడియన్స్‌కి బోర్‌ కొట్టేస్తుందని..' సరదాగా చరణ్‌ సమాధానమిచ్చారు. 'రంగస్థలం' సక్సెస్‌ని హ్యాపీగా ఎంజాయ్‌ చేస్తున్న చరణ్‌ ఆ మూడ్‌ నుండి బయటికి వచ్చి ఓ పక్క బోయపాటి సినిమాతో బిజీ అయ్యారు. మరోవైపు హ్యాపీ మొబైల్‌ కంపెనీ నుండి ఈ భారీ ఆఫర్‌ రావడంతో ఇందుకు సైన్‌ చేశారు.

ఆయన ఒప్పుకున్న బ్రాండ్స్‌ నుండి వచ్చే ఆదాయంలో 15 శాతం ఆదాయం కొత్తగా ఏర్పాటు చేయబోయే ఫౌండేషన్‌కి కేటాయించారు రామ్‌చరణ్‌. ఆరోగ్య సమస్యలతో బాధపడే పేద ప్రజలకు సాయమందించే దిశగా ఏర్పాటు చేస్తున్న ఆ కొత్త ఫౌండేషన్‌ వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని చరణ్‌ తెలిపారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS