మెగా హీరో రామ్ చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న 'కాటమరాయుడు' సినిమా విజయం సాధించాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నానన్నారు. గతేడాది ఇయర్ ఎండింగ్‌లో 'ధృవ' సినిమాతో మన ముందుకొచ్చి, సంచలనాత్మక విజయాన్ని అందుకున్నాడు చరణ్. ఈ ఏడాది స్టార్టింగ్‌లో సంక్రాంతికి 'ఖైదీ నెంబర్ 150' సినిమాతో చిరంజీవి బీభత్సమైన రికార్డులు సృష్టించారు. ముచ్చటగా మూడోసారి ఉగాదికి పవన్ కళ్యాణ్ 'కాటమరాయుడు' సినిమాతో వస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదలయ్యింది. ఈ టీజర్ చాలా బాగుందని బాబాయ్‌కి అబ్బాయ్ కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. అలాగే ఈ టీజర్‌తో ఉగాది పండగ ముందుగానే వచ్చేసిందన్నారు. అంటే అంత బాగా చరణ్‌కిి టీజర్ నచ్చేసిందట. మరి కొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మెగా కాంపౌండ్‌కి హ్యాట్రిక్ సినిమా కానుంది. ఈ నెల 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కిషోర్ కుమార్ పార్ధసాని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు శరత్ మరార్ నిర్మాణం వహిస్తుండగా, ముద్దుగుమ్మ శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరో పక్క చరణ్ - సుకుమార్ కాంబినేషన్‌లో ఓ ప్రయోగాత్మక చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో చరణ్ సరికొత్త గెటప్‌లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో సమంత, చరణ్‌కి జోడీగా నటిస్తోంది.