మార్చి 27.. రామ్ చరణ్ పుట్టిన రోజు. ఇంకా చాలా టైమ్ ఉంది లెండి. కాకపోతే.. ఆ రోజున చరణ్ బోలెడన్ని బహుమానాలు ఇవ్వబోతున్నాడు. `ఆర్.ఆర్.ఆర్` తరవాత... రామ్ చరణ్ సినిమా ఏమిటన్న విషయంలో చాలా సందేహాలున్నాయి. దర్శకుల జాబితాలో చాలా పేర్లు వినిపిస్తున్నాయి. అనిల్ రావిపూడి నుంచి శంకర్ వరకూ - ఐదారు పేర్లు ఈ లిస్టులో ఉన్నాయి. అందులో ఒకర్ని బర్త్ డే రోజున ఫైనల్ చేయబోతున్నాడట.
చరణ్ తదుపరి సినిమా ఏమిటన్న విషయంలో.. బర్త్ డే రోజున క్లారిటీ రానుంది. అంతే కాదు.. `ఆచార్య`లో సిద్ధ ఎలా ఉండబోతున్నాడో కూడా అదే రోజున చూపించబోతున్నారు. చిరు ఆచార్యలో చరణ్ ఓ కీలకమైన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆపాత్ర పేరు సిద్ధా. సిద్దాని చరణ్ పుట్టిన రోజున పరిచయం చేయబోతున్నారు. అంతేకాదు... `ఆర్.ఆర్.ఆర్`కి సంబంధించిన ఓ స్పెషల్ టీజర్ కూడా అదే రోజున బయటకు రాబోతోంది. చూశారా? ఎన్ని గిఫ్టులో. అందుకే.. మార్చి 27 కోసం ఇప్పటి నుంచే ఎదురు చూపుల్లో పడిపోయారు మెగా అభిమానులు.