మెగా అప్‌డేట్‌ కమింగ్‌సూన్‌.!

మరిన్ని వార్తలు

మెగా వపర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి పలు రకాల టైటిల్స్‌ పరిశీలిస్తున్నారు. 'వినయ విధేయ రామ' పేరు ప్రముఖంగా వినిపిస్తున్నా ఇంకా కన్‌ఫామ్‌ న్యూస్‌ రాలేదు. విజయదశమి సందర్భంగా టైటిల్‌పై క్లారిటీ వస్తుందనీ ప్రచారం జరిగింది. దాంతో అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూశారు. కానీ ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు.

 

తాజాగా ఈ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌కి పనులు చురుగ్గా సాగుతున్నాయట. టైటిల్‌ డిజైన్‌తో కూడిన ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసే సన్నాహాల్లో ఉన్నారట చిత్ర దర్శక నిర్మాతలు. మరోపక్క ఓన్లీ టైటిల్‌ కాకుండా, మేకింగ్‌ వీడియో టైప్‌లో అభిమానుల్ని అలరించేలా మ్యాజిక్‌ చేద్దామని దర్శకుడు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. నవంబర్‌ 7 దీపావళి. ఈ సందర్భంగా అభిమానులకు మెగా గిఫ్ట్‌ అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

అది కేవలం టైటిల్‌ మాత్రమేనా? అంతకు మించి ఉంటుందా? అనే సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఈ సినిమాలో చరణ్‌ సరసన కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. తొలి సినిమా 'భరత్‌ అనే నేను'తో సూపర్‌ హిట్‌ అందుకుంది కైరా అద్వానీ. చరణ్‌ సినిమాలో డాన్సుల పరంగా ఈ బ్యూటీ అదరగొట్టేసిందట. 

చరణ్‌తో ఓ మాస్‌ సాంగ్‌లో కైరా స్టెప్పులు అదిరిపోనున్నాయని సమాచారమ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS