విక్టరీ వెంకటేష్ త్వరలోనే 'ఎఫ్ 2' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌తో కలిసి నటిస్తున్నారు వెంకటేష్. మెగా మల్టీ స్టారర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. తమన్నా తొలిసారి వెంకీతో జత కడుతోంది ఈ చిత్రంలో. మెహ్రీన్ మరో కథానాయికగా నటిస్తోంది.
దీంతో పాటు వెంకీ మరో చిత్రంలోనూ నటిస్తున్నాడు. అదే మేనల్లుడు నాగచైతన్యతో నటిస్తున్న 'వెంకీ మామ' చిత్రం. కేఎస్ రవీంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ రెండూ కాక, వెంకీ త్వరలో ఓ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారట. దిమ్మ తిరిగే సర్ప్రైజట అది. వెంకీ పలు ప్రయోగాత్మక చిత్రాల్లో కూడా నటించారు గతంలో. అయితే తాజాగా వెంకీ ఇవ్వబోయే ఆ సర్ప్రైజ్ ఏంటనే విషయంపై సర్వత్రా ఆశక్తి నెలకొంది. డిఫరెంట్ గెటప్స్ ట్రై చేయడంలోనూ, 'గురు' వంటి డిఫరెంట్ క్యార్టెర్స్ ప్లే చేయడంలోనూ కూడా వెంకీ ముందుంటారు.
అయితే సర్ప్రైజ్ అని చెప్పి, అలా వదిలేస్తే ఎలా? ఈ ఉత్కంఠని తట్టుకోవడం కూసింత కష్టమే కదా. ఇకపోతే వెంకీ సినీ ప్రయాణం మొదలై ఈ రోజుకు 32 ఏళ్లు దాటింది. ఈ రోజు నేనే నటుడిగా జన్మించాను అంటూ వెంకీ ట్వీట్ చేశారు. 'కలియుగ పాండవులు' చిత్రంతో వెంకీ తెలుగు సినిమా తెరంగేట్రం జరిగింది. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసి, ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు.