మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - బోయపాటి శ్రీను కలయికలో వస్తున్న చిత్రం షూటింగ్ ఇంకా సరిగ్గా మొదలుకాక ముందే బిజినెస్ పరంగా సంచలనాలు సృష్టిస్తున్నది.
వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం హిందీ డబ్బింగ్ రైట్స్ రూ 22 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇది ఒకరకంగా ఒక మెగా రికార్డు అని చెప్పొచ్చు. ఇప్పటికే తెలుగు సినిమాలని హిందీలోకి డబ్బింగ్ చేసి విడుదల చేస్తుంటే అక్కడ బాగా మార్కెట్ ఏర్పడుతున్నది.
ఆ కారణంగానే తెలుగు సినిమాలకి ఇంతటి డిమాండ్ ఏర్పడింది. ఈ చిత్రానికి ఇంతటి రేటు పలకడానికి మరో కారణం- దర్శకుడు బోయపాటి శ్రీను. ఈయన చిత్రాలలో యాక్షన్ మోతాదు ఎక్కువగా ఉంటుండటం, అది నార్త్ ఇండియాలో ప్రేక్షకులకి బాగా నచ్చే అంశం కూడా కావడంతో ఇంతటి భారీ రేటు పలికింది.
మొత్తానికి మెగా పవర్ స్టార్ చిత్రం షూటింగ్ మధ్యలోనే సంచలనాలకి కేంద్ర బిందువు అయింది.