'గురు' సినిమా తర్వాత వెంకటేష్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. వరుసగా 'గోపాల గోపాలా', 'దృశ్యం', 'గురు' చిత్రాలతో హుందా అయిన కథలనే ఎంచుకుని డిఫరెంట్ స్టైల్‌ని చూపించిన వెంకటేష్ ఇప్పుడు మరో జోనర్‌ని సెలెక్ట్ చేసుకున్నాడు. అదే మల్టీ స్టారర్ జోనర్. వరుసపెట్టి మల్టీ స్టారర్స్ స్టోరీస్‌కే ఓటేస్తున్నాడు.
ఆల్రెడీ మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌తో 'ఎఫ్ 2' చిత్రంలో నటిస్తున్నాడు వెంకటేష్. నాగచైతన్యతో 'వెంకీ మామ' చిత్రం కూడా సెట్స్‌పై ఉన్నట్లే. ఇప్పుడు మరో మల్టీ స్టారర్‌కి వెంకీ ఓకే అన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో కూడా ఓ యంగ్ హీరో వెంకీతో కలిసి నటించే అవకాశాలున్నాయట. ఇలా వరుసపెట్టి మల్టీ స్టారర్స్ సినిమాలకే వెంకీ ఓటేస్తుంటే, సోలో హీరోగా వెంకీని ఇక ఎక్స్‌పెక్ట్ చేయలేమా? అని ఆయన అభిమానులు ఢీలా పడుతున్నారు. అయితే వెంకీని ఏ క్యారెక్టర్‌లో చూసినా అభిమానులకు ఆనందమే.
వెంకీ - వరుణ్‌తేజ్ మల్టీ స్టారర్ 'ఎఫ్ 2' సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి పండక్కి అసలు సిసలు పండగలాంటి సినిమాగా 'ఎఫ్ 2'ను తీర్చిదిద్దుతున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. దిల్‌రాజు బ్యానర్‌లో రూపొందుతోన్న ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
వెంకీ, వరుణ్‌తేజ్ తోడల్లుళ్లుగా నటిస్తున్న ఈ చిత్రం ఆధ్యంతం వినోదాన్ని పంచేలా, సంక్రాంతికి సకుటుంబ సపరివార సమేతంగా ధియేటర్‌కి వెళ్లి ఎంజాయ్ చేసేలా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది.