తేజూకి 'హిట్‌' సర్టిఫికెట్‌ ఇచ్చేసిన చెర్రీ.!

By iQlikMovies - June 28, 2018 - 16:38 PM IST

మరిన్ని వార్తలు

మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'తేజ్‌ ఐ లవ్‌యూ'. కరుణాకరన్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. జూలై 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ సందర్భంగా మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ఈ సినిమాపై సోషల్‌ మీడియాలో స్పందించాడు. కరుణాకరన్‌ నుండి వస్తున్న హిట్‌ సినిమా 'తేజ్‌ ఐ లవ్‌యూ' అంటూ, చిత్ర యూనిట్‌కి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పాడు. ఇంకేం చెర్రీ సర్టిఫికెట్‌ ఇచ్చాడంటే, నిజంగానే ఇది హిట్‌ సినిమా అనొచ్చు. ఈ మధ్య సరైన సక్సెస్‌ లేక సతమతమవుతున్న తేజుకి ఈ సినిమా హిట్‌ చాలా చాలా అవసరం. 

తాజాగా విడుదలైన ట్రైలర్‌ సినిమాపై అంచనాల్ని పెంచేలానే ఉంది. యూ ట్యూబ్‌లో ఈ ట్రైలర్‌కి రికార్ట్‌ స్థాయిలో వ్యూస్‌ వస్తున్నాయి. కె.ఎస్‌.రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌కి 'తొలిప్రేమ' వంటి సూపర్‌ డూపర్‌ హిట్‌ ఇచ్చిన డైరెక్టర్‌ కరుణాకరన్‌. ఆ తర్వాత ఎన్నో సక్సెస్‌ఫుల్‌ లవ్‌ స్టోరీలను అందించిన క్రెడిట్‌ ఉంది కరుణాకరన్‌ ఖాతాలో. ఈ మధ్య 'జవాన్‌', 'ఇంటెలిజెంట్‌' అంటూ ఒకే తరహా పవర్‌ఫుల్‌ స్టోరీస్‌ని ఎంచుకుని క్యాచీ ఎంటర్‌టైన్‌మెంట్‌కి చాలా దూరమైపోయాడు తేజు. ఈ సినిమా ట్రైలర్‌ చూస్తుంటే, అంతకు ముందు తేజు కనిపిస్తున్నాడు. 

సో ఈ సినిమా తేజుకి హిట్‌ ఇచ్చేలానే ఉంది కానీ, చూడాలి మరి ఫైనల్‌ రిజల్ట్‌ తెలియాలంటే రిలీజ్‌ వరకూ ఆగాల్సిందే. ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్‌ ఈ సినిమాలో తేజుతో ఆన్‌ స్క్రీన్‌ రొమాన్స్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS