‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా సందట్లో పడి నిర్మాతగా చరణ్, తన తండ్రి 152వ సినిమాని అస్సలు పట్టించుకోవడం లేదట... అనే వార్త ఈ మధ్య చక్కర్లు కొట్టింది. అయితే, ఈ గాసిప్‌పై తాజాగా చిరంజీవి 152 నిర్మాణంలో భాగస్వామి అయిన మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ‘నిర్మాతగా చరణ్‌తో కలిసి పని చేయడం చాలా చాలా కంఫర్టబుల్. ప్రతీ విషయంలోనూ ఆయన మాకు సహకరిస్తూనే ఉంటారు. సినిమాకి సంబంధించిన అన్ని విషయాలనూ ఇద్దరం కలిసి చర్చించుకునే తుది నిర్ణయాలు తీసుకుంటుంటాం. హీరోగా బిజీగా ఉన్నప్పటికీ నిర్మాతగానూ చరణ్ ప్రతీ విషయంలోనూ రెస్పాన్సిబుల్‌గా ఉంటాడు.
ఈ విషయంలో ఇంతవరకూ ఏవైతే గాసిప్స్ వచ్చాయో ఆ గాసిప్స్‌లో ఎలాంటి నిజం లేదు..’ అని ఆ ప్రెస్ నోట్ ద్వారా మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ తరపున నిర్మాత నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో కావాలనే చిరు 152 సినిమాకి సంబంధించి ఎవరో దుష్ప్రచారం చేస్తున్నారన్న విషయం తేటతెల్లమవుతోంది. ఇకపోతే, చిరు 152 సినిమాకి ‘ఆచార్య’ అనే టైటిల్ కన్‌ఫామ్ చేసిన సంగతి తెలిసిందే. హీరోయిన్‌గా కాజల్, అనుష్క పేర్లు పరిశీలిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి చరణ్ నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా తాత్కాలికంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా వేసిన సంగతి తెలిసిందే.