మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, ప్రముఖ మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారంటూ ఓ హాట్ న్యూస్ వెరీ వెరీ హాట్‌గా స్ప్రెడ్ అవుతోంది. ఇంతకీ ఈ గాసిప్‌లో నిజమెంతుందో తెలీదు కానీ, ఇటీవలే 'మహానటి' సినిమాతో దుల్కర్ సల్మాన్ తెలుగులో నటుడిగా మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు, తెలుగు ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయిపోయాడు. దాంతో ఆయన తెలుగులో మరిన్ని చిత్రాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడంటూ టాక్ వినిపిస్తోంది.
అయితే మలయాళంలో దుల్కర్ సల్మాన్ టాప్ హీరో. బిజీయెస్ట్ హీరో. అలాంటిది తెలుగులో వరుసపెట్టి సినిమాలు చేసే అవకాశాలుంటాయా అని ఆశ్చర్యపోతున్నారు. అయితే వరుస సినిమాల సంగతి సరే కానీ, అతి త్వరలోనే దుల్కర్ సల్మాన్ తెలుగులో మరో సినిమాతో సందడి చేయబోతున్నాడని మాత్రం తెలుస్తోంది. అంతేనా, ఈ సినిమాలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయనీ తెలుస్తోంది.
రామ్‌చరణ్ 'రంగస్థలం' సినిమాతో తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా మార్కెట్ సంపాదించుకున్నాడు. అలాగే ఇతర భాషా హీరోలతో కలిసి నటిస్తే ఆ మార్కెట్ మరింత పెరిగే అవకాశాలున్నాయనీ అభిమానులు భావిస్తున్నారు. ఇది శుభ పరిణామమే. అయితే ఇది జరిగే పనేనా?
చూడాలి మరి. ప్రస్తుతం బోయపాటి శీను సినిమాతో బిజీగా ఉన్నాడు రామ్‌చరణ్. ఈ సినిమాలో 'భరత్' బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది.