బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌తో 'లోఫర్' బ్యూటీ దిశాపటానీ ఓ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా చాలా ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలో కనిపంచనుందట. సల్మాన్‌తో కలిసి యాక్షన్ సీన్స్ ఇరగదీసేయనుందట. యాక్షన్ సినిమాల్లో నటించడమంటే దిశాపటానీకి చాలా ఇష్టం.
ఆల్రెడీ ఈ తరహా సినిమాల్లో నటించి తన టాలెంట్ ఏంటో చూపెట్టేసిందీ ముద్దుగుమ్మ. సౌత్‌లో 'సంఘమిత్ర' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా కోసం కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీల్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. ఇకపోతే ఇటీవల 'బాఘీ' చిత్రంలో నటించింది. ఈ సినిమాలో టైగర్ ష్రాఫ్‌తో పోటీగా యాక్షన్ సీన్స్‌లో దుమ్ము దులిపేసింది. తెలుగులో ఘన విజయం సాధించిన 'క్షణం' సినిమాకి హిందీ రీమేకే ఈ 'బాఘీ'. ఇప్పుడు సల్మాన్‌ఖాన్ చిత్రం కోసం కిక్ బాక్సింగ్ తదితర మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ పొందుతోందట.
దిశాపటానీ డెడికేషన్‌కీ, యాక్షన్ సీన్స్‌లో ఆమె ఆటిట్యూడ్‌కి షాక్ తింటున్నాడట మన కండల వీరుడు. అవును మరి ఈ బ్యూటీ అనుభవం తక్కువా. ఏకంగా జాకీచాన్‌నే మెప్పించింది కదా తన యాక్షన్‌తో. గతంలో జాకీచాన్‌తో కలిసి 'కుంగ్‌ఫూ యోగా' చిత్రంలో నటించింది కదా. ఇలా చెప్పుకుంటూ పోతే, ఈ బ్యూటీ యాక్షన్ గాధ చాలానే ఉంది మరి. సల్మాన్‌తో చేస్తున్న సినిమా కోసమే దిశాపటానీ ఈ మధ్య బాగా కసరత్తులు చేసి, ఫిట్‌గా మారింది. ఎప్పుడూ ఫిట్‌గానే ఉంటుందిలెండి.
అయితే ఈ మధ్య ఏకంగా పలకల శరీరంతో సోషల్‌మీడియాలో దర్శనమిస్తోంది కదా.!